
వాషింగ్టన్: ప్రముఖ మ్యూజిక్ కాన్సర్ట్ ‘కోల్డ్ ప్లే’ ఎపిసోడ్‌లో మరో కీలక మలుపు తిరిగింది. కంపెనీ మాజీ సీఈవో ఆండీ బైరాన్‌ను కౌగిలించుకున్నందుకు అమెరికా టెక్ సంస్థ ఆస్ట్రానమర్ చీఫ్ పీపుల్ ఆఫీసర్ క్రిస్టిన్ కాబోట్‌ను సైతం సంస్థ బయటకు సాగనంపింది. సంస్థ పరువు తీశారంటూ ఆమెతో బలవంతంగా రాజీనామా చేయించింది. ఈ క్రమంలో హ్యూమన్ రిసోర్స్ చీఫ్ కాబోట్ ఇప్పుడు తమ కంపెనీలో లేరని, రాజీనామా చేశారంటూ ఆస్ట్రానమర్ ఓ ప్రకటనలో తెలిపింది.
గత బుధవారం మాసెచూసెట్స్ స్టేట్ బోస్టన్‌లోని గిల్లెట్ స్టేడియంలో కోల్డ్ ప్లే కాన్సర్ట్ జరిగింది. ఆ కాన్సర్ట్‌లో ఆస్ట్రానమర్ సీఈవో ఆండీ బిరాన్,హెచ్‌ఆర్ హెడ్ క్రిస్టిన్ కాబోట్‌లు హాజరయ్యారు. అయితే,కాన్సర్ట్ జరిగే సమయంలో ఆండీ, క్రిస్టెన్ ఒకరినొకరు ఆలింగనం చేసుకున్నారు. సరిగ్గా అదే సమయంలో వారిపై స్పాట్ లైట్ పడడం, ఆ దృశ్యం పెద్దస్క్రీన్‌లో కనిపించడంతో వారి ప్రేమాయణం బయటపడింది. సీఈవో వ్యవహారం ఆయన స్థాయికి తగ్గట్టుగా లేదని నెటిజన్లు చురకలు వేయగా... విడాకులు ఇవ్వనున్నట్లు ఆయన భార్య సంకేతాలిచ్చింది.
సంస్థ ఆస్ట్రానమర్ ఆండీని పదవి నుంచి బలవంతంగా తొలగించింది. సీఈవో బాధ్యతల్ని మరొకరికి అప్పగించింది. అవమానం భారం తట్టుకోలేని ఆండీ తన పదవికి రాజీనామా చేశారు. ఈ క్రమంలో హెచ్‌ఆర్ హెడ్ క్రిస్టెన్ కబోట్ సైతం సంస్థకు రాజీనామా చేయడం టెక్ వర్గాల్లో చర్చాంశనీయంగా మారింది.
Andy Byron, CEO of Astronomer, was caught at a Coldplay concert apparently having an affair with the company’s CPO, Kristin Cabot.
Both Byron and Cabot are married to other people.
Most awkward moment of 2025?pic.twitter.com/bVOTq6XgF8— Paul A. Szypula 🇺🇸 (@Bubblebathgirl) July 17, 2025