పత్రాలన్నీ వెంట ఉండాల్సిందే | US Green Card Holders Face New Fines and Misdemeanour Charges | Sakshi
Sakshi News home page

పత్రాలన్నీ వెంట ఉండాల్సిందే

Jul 25 2025 5:06 AM | Updated on Jul 25 2025 5:06 AM

US Green Card Holders Face New Fines and Misdemeanour Charges

గ్రీన్‌కార్డ్‌ హోల్డర్లు సహా నాన్‌–సిటిజెన్స్‌ అందరికీ ఇదే నియమం

పాటించకుంటే జరిమానా తప్పదు

అమెరికా ప్రభుత్వం తాజా హెచ్చరిక

వాషింగ్టన్‌: అసలు కంటే కొసరు పనే ముఖ్యమన్న తరహా లో అమెరికా ప్రభుత్వం వ్యవహరిస్తోంది. ఎలాగూ వీసా నిబంధనలు, ఎయిర్‌పోర్ట్‌లో క్షుణ్ణంగా తనిఖీలు దాటుకొని అమెరికాలోకి అడుగుపెట్టినా దాదాపు ప్రతి ఒక్క అమెరికాయేతర వ్యక్తులంతా ఎక్కడ పడితే అక్కడ అధికారులు అడిగే అన్ని రకాల డాక్యుమెంట్లను చూపించాల్సిందేనని ట్రంప్‌ సర్కార్‌ హెచ్చరించింది. ఈ మేరకు అమెరికా కస్టమ్స్‌ అండ్‌ బోర్డర్‌ ప్రొటెక్షన్స్‌(సీబీపీ) విభాగం హెచ్చరికలు జారీచేసింది.

 గ్రీన్‌కార్డ్‌ సాధించిన వ్యక్తులు సహా అమెరికా పౌరసత్వం పొందని వారంతా నిరంతరం తమ రిజిస్ట్రేషన్‌ డాక్యుమెంట్లను తమ వెంటేసుకుని తిరగాల్సిందేనని సీబీపీ పే ర్కొంది. అధికారులు అడిగినప్పుడు చూపించకపోతే జరిమానా ముప్పు తప్పదని, కొన్ని సార్లు అత్యల్పస్థాయి నేరాభియోగాలను సైతం ఎదుర్కో వాల్సిఉంటుందని సీబీపీ హెచ్చరించింది. 

18 ఏళ్లు, ఆపైబడిన వారందరికీ ఇదే నియమం వర్తించనుంది. దీంతో విద్య, ఉద్యోగాల కోసం వచ్చే భారతీ యులు, వారి వెంట వచ్చే కుటుంబసభ్యులు, చిన్నారులకు కొత్త సమస్య వచ్చిపడింది. సినిమా, షాపింగ్, పార్క్, హోటల్, ఆస్పత్రి, రైల్వేస్టేషన్‌.. ఇలా ఎక్కడికి వెళ్లినా ముఖ్యమైన రిజిస్ట్రేషన్‌ పత్రా లు పట్టుకెళ్లడమంటే ఎంతో ఇబ్బందితో కూడిన వ్యవహారం. అక్రమంగా వలసవచ్చారని ఏ క్షణాన ఎవరిపై అనుమానం వచ్చినా వెంటనే అధికారులు సోదాలు, తనిఖీలుచేసేందుకు వీలుగా విదేశీయు లకు ఈ అడ్వైజరీని జారీచేసినట్లు సీబీపీ తెలిపింది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement