బ్రిటన్ ప్రధాని స్టార్మర్‌కు పిలుపునిచ్చిన జిన్‌పింగ్
బీజింగ్/లండన్: వైషమ్యాలను మరచి స్నేహగీతం ఆలపించేందుకు చైనాకు విచ్చేసిన బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్‌కు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ సాదర స్వాగతం పలికారు. బహుళ ధృవ ప్రపంచం కోసం సమష్టిగా పాటుప డదామని స్టార్మర్‌కు జిన్‌పింగ్ పిలుపు నిచ్చారు. ఎనిమిదేళ్ల తర్వాత బ్రిటన్ ప్రధాని ఒకరు చైనాలో పర్యటించడం ఇదే తొలిసారి. గురువారం బీజింగ్‌లోని గ్రేట్ హాల్ ఆఫ్ పీపుల్‌లో ఇరునేతలు సమావేశమై ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఈ సందర్భంగా జిన్‌పింగ్ మాట్లాడారు.
‘‘అన్ని దేశాలు కట్టుబాటు చూపినప్పుడే అంతర్జాతీయ చట్టాలు అత్యంత ప్రభావవంతంగా అమలవు తాయి. ప్రధా నమైన దేశాలు ఈ కట్టుబాటు విషయంలో ముందుండి ఇతర దేశాలకు ఆదర్శప్రాయంగా ఉండాలి. ఆ దేశాలే కట్టుతప్పితే ఇక ప్రపంచంలో ఆటవిక పాలనే రాజ్యమేలుతుంది’’ అని పరోక్షంగా ట్రంప్ వైఖరిని జిన్‌పింగ్ తూ ర్పారబట్టారు. ‘‘ చైనా ఏ స్థాయిలో ఎదిగినా సరే ప్రపంచంలోని ఏ దేశానికి ప్రమాదకరంగా పరిణమించబోదు’’ అని జిన్‌పింగ్ స్పష్టంచేశారు.
కుదిరిన కీలక ఒప్పందాలు
బ్రిటన్ పౌరులు గరిష్టంగా 30 రోజులపాటు వరకు చైనాలో వీసారహిత బిజినెస్/పర్యాటక ప్రయాణాలు చేసేందుకు చైనా అంగీకారం తెలిపింది. వ్యవస్థీకృత నేరాలు, అక్రమ వలసల కట్టడికి ఇరుదేశాలు అంతర్జాతీయ సహకార ఒప్పందం కుదుర్చుకున్నాయి. వలసదారులను బ్రిటన్‌లోకి వచ్చేందుకు స్మగ్లర్లు ఉపయోగిస్తున్న చైనా తయారీ చిన్న పడవల విడిభాగాలు వాళ్లకు దక్కకుండా చేయాలని చైనాను బ్రిటన్ కోరింది. ఇరుదేశాల మధ్య కొత్త సరిహద్దు భద్రతా ఒప్పందం కుదుర్చుకోవాలని నేతలు నిర్ణయించుకున్నారు.
ద్వైపాక్షి సేవా ఒప్పందం, యూకే–చైనా సంయుక్త ఆర్థిక, వాణిజ్య కమిషన్‌ను బలోపేతం చేయడం, నర్సింగ్, థెరపీ, వ్యక్తిగత సంరక్షణ, క్రీడా రంగాల్లో పరస్పర సహకారం, సాంకేతిక, వృత్తివిద్యా, శిక్షణ రంగాల్లో సహకారం, ఫుడ్ సేఫ్టీ, స్వదేశీ వ్యవసాయ, వాణిజ్య, జాతీయ ప్రయోజ నాలు దెబ్బతినకుండా వ్యాపారం చేయడం వంటి అంశాల్లో ఒప్పందాలు కుదుర్చు కున్నారు. యూకే ఫార్మా దిగ్గజం ఆస్ట్రాజెనెకా ఇకపై చైనాలో మరో ఐదేళ్లలోపు దాదాపు రూ.1.37 లక్షల రూపాయల పెట్టుబడులు పెట్టనుంది.


