లైవ్‌లో అడ్డంగా బుక్కై.. సీఈవో చిలక్కొట్టుడుపై జోకులు | Jokes On Astronomer CEO Andy Byron Kristin Cabot Video Viral | Sakshi
Sakshi News home page

లైవ్‌లో అడ్డంగా బుక్కై.. సీఈవో చిలక్కొట్టుడుపై జోకులు

Jul 18 2025 10:53 AM | Updated on Jul 18 2025 1:27 PM

Jokes On Astronomer CEO Andy Byron Kristin Cabot Video Viral

ఆయనొక ప్రముఖ కంపెనీకి సీఈవో. పెళ్లై పిల్లలు కూడా ఉన్నారు. అయితే తన కంపెనీలో పని చేసే ఓ ఉద్యోగితో చిలక్కొట్టుడు యవ్వారానికి దిగాడు. ఇద్దరూ చెట్టాపట్టాలేసుకుని ఓ మ్యూజికల్‌ నైట్‌కు వెళ్లారు. అక్కడ ఆమెతో సన్నిహితంగా ఉన్న టైంలో అనుకోకుండా కెమెరా వాళ్లవైపు తిరిగింది. అంతే సోషల్‌ మీడియా ఆ జంట గురించి కోడై కూస్తోంది.

కోల్డ్‌ప్లే క్రిస్‌మార్టిన్‌ బుధవారం మాసెచూసెట్స్ స్టేట్‌ బోస్టన్‌లోని జిల్లెట్‌ స్టేడియంలో ప్రదర్శన ఇచ్చాడు. ప్రదర్శన కొనసాగుతున్న టైంలో.. కెమెరా హఠాత్తుగా ఓ జంట వైపు తిరిగాయి. అప్పటిదాకా ఒకరినొకరు వాటేసుకున్న ఆ ఇద్దరూ.. కెమెరా ఫోకస్‌ తమ మీద పడే సరికి సిగ్గుతో ముడుచుకుపోయారు. ఆపై ముఖాలు దాచేసుకుంటూ కనిపించారు. అయితే.. 

అందులో ఉంది ఆస్ట్రానమర్‌ సీఈవో ఆండీ బైరోన్‌. ఆస్ట్రానమర్‌ అనేది న్యూయార్క్‌ కేంద్రంగా నడుస్తున్న ఒక టెక్నాలజీ కంపెనీ. అయితే ఆయనతో ఆ వీడియోలో ఉన్నది ఆయన భార్య కాదు. ఆ కంపెనీలోనే చీఫ్‌ పీపుల్‌ ఆఫీసర్‌గా పని చేస్తున్న క్రిస్ట్రిన్‌ క్యాబెట్‌. ఈ వీడియోతో ఆ  ఇద్దరి మధ్య ఏదో నడుస్తోందన్న ప్రచారం తీవ్రతరమైంది. మరికొందరు పబ్లిక్‌ ఈ ఇద్దరు ఇలా పట్టుబడడంపై రకరకాలుగా స్పందిస్తున్నారు. అంతెందుకు.. 

క్రిస్‌మార్టిన్‌ సైతం ఈ వ్యవహారంపై సరదాగా స్పందించాడు. ఈ ఇద్దరినీ చూడండి.. బహుశా వీళ్ల మధ్య సంబంధం ఉందేమో లేకుంటే మాములుగానే సిగ్గుపడుతున్నారేమో అంటూ కామెంట్‌ చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు టిక్‌టాక్‌, రెడ్డిట్‌, ట్విటర్‌, ఇన్‌స్ట్రాగ్రామ్‌లో వైరల్‌ అవుతున్నాయి. 

 

 

 

 

 ఇదిలా ఉంటే.. క్రిస్ట్రిన్‌ క్యాబెట్‌కు గతంలో వివాహం.. విడాకులు అయ్యాయి. మరోవైపు ఆండీ బైరోన్‌కు వివాహం అయ్యింది. ఆయన భార్య మేగన్‌ కెరిగన్‌ బైరోన్‌.. ఓ ప్రముఖ విద్యాసంస్థకు అసోషియేట్‌ డైరెక్టర్‌గా పని చేస్తున్నారు.  ఈ జంటకు ఇద్దరు పిల్లలు. 

తాజా వీడియో వైరల్‌ నేపథ్యంలో ఆండీ బైరోన్‌ పేరిట ఓ ప్రకటన వెలువడింది. అయితే అది వ్యంగ్యంగా ఉండడం గమనార్హం. ఫ్యాక్ట్‌చెక్‌లో అదొక పేరడీ పేజీ నుంచి సర్క్యులేట్‌ అయ్యిందని తేలింది. అధికారికంగా బైరోన్‌ దీనిపై ఎలాంటి ప్రకటన ఇవ్వేలదు.  అయితే.. భర్తకు సంబంధించిన వీడియో వైరల్‌ అయ్యాక.. ఆమె తన పేరులోని బైరోన్‌ను సోషల్‌ మీడియా అకౌంట్ల నుంచి తొలగించారు. అంతేకాదు.. ఆ అకౌంట్లనూ డీయాక్టివేట్‌ చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఈ జంట విడాకులు ఖాయమనే చర్చ మొదలైంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement