సారూ.. ఈమె కత్రిన.. ఆమె కరీన! | Chris Martin confusion for Katrina Kaif name | Sakshi
Sakshi News home page

సారూ.. ఈమె కత్రిన.. ఆమె కరీన!

Sep 25 2016 5:45 PM | Updated on Oct 17 2018 4:36 PM

సారూ.. ఈమె కత్రిన.. ఆమె కరీన! - Sakshi

సారూ.. ఈమె కత్రిన.. ఆమె కరీన!

కత్రినా కైఫ్‌, కరీనా కపూర్‌ ఖాన్.. ఈ ఇద్దరు బాలీవుడ్‌ హీరోయిన్లు.

కత్రినా కైఫ్‌, కరీనా కపూర్‌ ఖాన్.. ఈ ఇద్దరూ బాలీవుడ్‌ హీరోయిన్లు. ఎన్నో సినిమాల్లో నటించిన వీరికి ప్రత్యేకంగా తమకంటూ ఓ గుర్తింపు ఉంది. కానీ, వీరి విషయంలో ‘కోల్డ్‌ప్లే’ సింగర్‌ క్రిస్‌ మార్టిన్‌ తికమక పడ్డాడు. కరీనాను, కత్రినాను వేర్వేరుగా కాకుండా కలిపి గుర్తుంచుకున్నట్టు ఉంది. అందుకే ఇద్దరి పేర్లను కలిపి కత్రినా ఖాన్‌ చేసేశాడు.

నవంబర్‌ 19న గ్లోబల్‌ సిటిజెన్‌ కాన్సర్ట్‌ తొలిసారి భారత్‌లో జరగబోతున్న విషయం తెలిసిందే. ఈ విషయాన్ని శనివారం న్యూయార్క్‌లో జరిగిన గ్లోబల్‌ సిటిజెన్‌ కాన్సర్ట్‌లో క్రిస్‌ మార్టిన్‌ ప్రకటించాడు. ముంబైలో జరగనున్న ఈ సంగీత విభావరిలో తనతోపాటు బాలీవుడ్‌ స్టార్లు ఆమీర్‌ ఖాన్‌, అమితాబ్‌ బచ్చన్‌ తదితరులు వేదిక పంచుకోనున్నట్టు చెప్పాడు. ఈ మేరకు తన వద్ద ఉన్న ఓ జాబితాను కూడా చదివి వినిపించిన క్రిస్‌ కరీనా, కత్రినా పేర్లను మాత్రం విడివిడిగా చెప్పలేదు. కత్రినా ఖాన్‌ అంటూ ఇద్దరిని కలిపి చెప్పాడు. దీంతో వేదికపై ఆయన పక్కనే ఉన్న ప్రియాంక చోప్రా కంగుతింది. ’ఓహ్‌’ అంటూ విస్మయాన్ని వ్యక్తం చేసింది. అయితే, భారతీయ పేర్లను పలుకడంలో అంతబాగా రాదని క్రిస్‌ సర్దిచెప్పాడు. స్వచ్ఛంద సేవ కోసం ఉద్దేశించిన గ్లోబల్‌ సిటిజెన్‌ కాన్సర్ట్‌ కు ప్రియాంక బ్రాండ్‌ అంబాసిడర్‌ వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. కరీన, కత్రిన పేర్ల విషయంలో క్రిస్‌ తికమక పడటాన్ని కావాలంటే మీరు కూడా ఈ కింది వీడియోలో 5.20 నిమిషాల వద్ద చూడొచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement