ఆ జంట మళ్లీ ఒక్కటైంది? | Is all well between Lawrence, Martin? | Sakshi
Sakshi News home page

ఆ జంట మళ్లీ ఒక్కటైంది?

Jan 10 2015 10:10 AM | Updated on Sep 2 2017 7:30 PM

ఆ జంట మళ్లీ ఒక్కటైంది?

ఆ జంట మళ్లీ ఒక్కటైంది?

హాలీవుడ్ నటి జెన్నీఫర్ లారెన్స్-మ్యుజీషియన్ క్రిస్ మార్టిన్ ల జంట మళ్లీ ఒక్కటైయ్యారు. చి న్నపాటి విభేదాల వల్ల విడిపోయిన ఈ జోడి తిరిగి డేటింగ్ చేస్తున్నారు.

లాస్ ఏంజిల్స్: హాలీవుడ్ నటి జెన్నీఫర్ లారెన్స్-మ్యుజీషియన్ క్రిస్ మార్టిన్ ల జంట మళ్లీ ఒక్కటైయ్యారు. చి న్నపాటి విభేదాల వల్ల విడిపోయిన ఈ జోడి తిరిగి డేటింగ్ చేస్తున్నారు. ప్రస్తుతం వారిద్దరు బిజీగా ఉన్నా.. వారి మధ్య బంధాన్ని యథావిధిగా కొనసాగిస్తున్నట్లు
పీపుల్ డాట్ కమ్ పేర్కొంది.  భార్య వైనీత్ కు మార్టిన్ దగ్గరగా ఉంటున్నాడని భావించిన జెన్నీఫర్ అతనితో బంధాన్ని అక్టోబర్ లో తెంచుకుంది. గత ఆగస్టులోడేటింగ్ ఆరంభించిన ఈ జోడీ రెండు నెలల్లోనే  దూరమయ్యారు. అయితే ఆ జోడీ డిసెంబర్ 30 వ తేదీన మళ్లీ వారి బంధాన్నిబలపరస్తూ ఓ డిన్నర్ లో కలుసుకుంది. 

 

వారి మధ్య చోటు చేసుకున్న విభేదాలను ప్రక్కకు పెట్టిన జెన్నీఫర్-మార్టిన్ లు తిరిగి రొమాన్స్ లో మునిగితేలుతున్నారు. అసలు వారిద్దరి మధ్య గొడవ రావడానికి మార్టిన్ పిల్లలే కారణమట. మార్టిన్ -వైనీత్ జంటకు కు ఇద్దరు పిల్లలు ఆపిల్(10), మోసెస్(8) లు ఉన్నారు. ఈ క్రమంలోనే మార్టిన్ తరచు వైనీత్ ఇంటికి వెళ్లడంతో జెన్నీఫర్ కాస్త అలిగింది. అయితే తిరిగి ఈ విషయాన్ని లైట్ గా తీసుకున్న జెన్నీఫర్ తిరిగి మార్టిన్ తో తన రిలేషన్ ను కొనసాగిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement