నన్ను జోలీ దంపతులు కిడ్నాప్ చేశారు! | I was kidnapped by Jolie and Pitt, Chris Martin | Sakshi
Sakshi News home page

నన్ను జోలీ దంపతులు కిడ్నాప్ చేశారు!

Dec 19 2014 6:27 PM | Updated on Sep 2 2017 6:26 PM

నన్ను జోలీ దంపతులు కిడ్నాప్ చేశారు!

నన్ను జోలీ దంపతులు కిడ్నాప్ చేశారు!

తనను హాలీవుడ్ నటి ఏంజిలీనా జోలీ మరియ ఆమె భర్త బ్రాడ్ పిట్ లు కిడ్నాప్ చేశారంటూ సింగర్ క్రిస్ మార్టిన్ తెలిపాడు.

లాస్ ఏంజిల్స్: తనను హాలీవుడ్ నటి ఏంజిలీనా జోలీ మరియ ఆమె భర్త బ్రాడ్ పిట్ లు కిడ్నాప్ చేశారంటూ సింగర్ క్రిస్ మార్టిన్ తెలిపాడు. ఏంజిలీనా జోలీ దర్శకత్వం వహిస్తున్న 'అన్ బ్రోకెన్' సినిమాకు పిట్ రాస్తున్న పాట కోసం తనను  కిడ్నాప్ చేశారని మార్టిన్ అన్నాడు. 'తొలుత ఆ సినిమాకు సంబంధించి ఒక సందేశాన్ని జోలీ-పిట్ లు పంపారు. ఆ పాట ఎలా వస్తుందో నన్ను చూడమంటూ ఆ మెస్సేజ్ సారాంశం. ఇందుకోసం వారు ముందు హెచ్చరించినట్లుగానే నన్ను కిడ్నాప్ చేశారు.

 

తలపై కొట్టడమే కాకుండా ముఖంపై స్ప్రే చేశారు. తరువాత చూస్తే తాను ఒక ఆఫీస్ లో ఉన్నానన్నాడు. అక్కడ బ్రాడ్ పిట్ ఎక్సర్ సైజ్ లు చేస్తుండగా.. ఏంజిలీనా జోలి భర్త ముందు కూర్చుని ఉంది. అంతేకాకుండా ఓ వ్యక్తి తనపీకపై కత్తిపెట్టి కూర్చున్నాడన్నాడు. ప్రస్తుతం పాట రాస్తున్నామని.. అది విన్నాక అభిప్రాయం చెప్పమన్నారని వారు తనకు తెలిపారని మార్టిన్ అన్నాడు. కాకపోతే ఇక్కడ ఒక ట్విస్ట్ ఉందండోయ్. ఇదంతా తమ వద్ద ఉన్న సాన్నిహిత్యం కారణంగానే అంటూ మార్టిన్ జోక్ పేల్చాడు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement