
పనిలో డెడికేషన్ అనాలో.. టీఆర్పీ కోసం పాకులాట అనాలో.. వ్యూస్ కోసం స్టంట్లు అనాలో.. ఈ ఘటన గురించి చదివాక మీ స్పందన కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి.
పాకిస్తాన్‌లో కురుస్తున్న భారీ వర్షాలకు పలు ప్రాంతాల్లో వరదలు పోటెత్తుతున్నాయి. ఈ క్రమంలో ఒక జర్నలిస్ట్ లైవ్ రిపోర్టింగ్ చేస్తూ నీటిలో కొట్టుకుపోయాడంటూ ఓ వీడియో వైరల్ అవుతోంది. ఈ ఘటన రావల్పిండిలోని చాహన్ డ్యామ్ వద్ద చోటుచేసుకుంది. రిపోర్టర్ పీకల లోతు వరద నీటిలో నిలబడి అక్కడి పరిస్థితి వివరిస్తున్నాడు. ఆ సమయంలో వరద ఉధృతికి ఆకస్మికంగా ప్రవాహం అతన్ని లోపలికి లాక్కెళ్లిపోయింది.
A Pakistani reporter is swept away by strong currents during a live broadcast while covering the floods in neck-deep water.#Pakistan #Floods pic.twitter.com/0raCbYaoer
— Al Arabiya English (@AlArabiya_Eng) July 17, 2025
అయితే ఈ వీడియో అక్కడికి మాత్రమే కట్ అయ్యింది. అతను కొట్టుకుపోయాడని, ఇప్పటిదాకా అతని ఆచూకీ తెలీయకుండా పోయిందనేది సదరు వార్త కథనాల సారాంశం. దీంతో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.
అతనిది మూర్ఖపు చర్య అని కొందరు, విధి నిర్వహణలో తప్పేం కాదని మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు. కెమెరామ్యాన్‌నెవర్‌డైస్ అంటూ మరికొందరు సరదా కామెంట్లు పెడుతున్నారు. అయితే.. మరికొందరు మాత్రం అతను అసలు రిపోర్టర్ కాదని, టిక్‌టాక్ లాంటి షార్ట్‌వీడియోస్ యాప్‌లలో వ్యూస్ కోసం ఇలాంటి స్టంట్లు చేస్తుంటాడని పలువురు కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం అతను సురక్షితంగానే ఉండి ఉంటాడన్నది ఆ కామెంట్ల సారాంశం. అయితే..
ఫ్యాక్ట్ చెక్‌లో అతని పేరు అలీ ముసా రాజా(Ali Musa Raza)గా తేలింది. రూహీ అనే చానెల్‌లో అతను చాలా కాలంగా రిపోర్టర్‌గా పని చేస్తున్నాడు. అతను క్షేమంగానే ఉన్నాడా? అనే దానిపై ఆ చానెల్ ఎలాంటి ప్రకటన చేయలేదు. తాజా ఘటన నేపథ్యంలో పలువురు జర్నలిస్టులు సైతం అతనికి సంఘీభావం తెలుపుతున్నారు. అతను క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నట్లు కామెంట్లు పెడుతున్నారు. చీప్ గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ కంటే ఇలాంటి ధైర్యమైన రిపోర్టర్లు సమాజానికి అవసరమని, అదే సమయంలో ఇలాంటివాళ్లు సురక్షితంగా కూడా ఉంటాలంటూ కామెంట్లు పెడుతున్నారు. రిపోర్టర్ అలీ ముసా రాజాకు ఇలాంటి స్టంట్లు కొత్తేం కాదు. కిందటి ఏడాది.. పంజాబ్ ప్రావిన్స్ సఖి సర్వర్ ఏరియాలో వరదలను నడుం లోతు నీళ్లలో కవర్ చేస్తూ వైరల్ అయ్యాడు కూడా.
పాకిస్తాన్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇది గత సంవత్సరం కంటే 124% ఎక్కువ వర్షపాతం అని అక్కడి వాతావరణ శాఖ చెబుతోంది. తాజా వరదల ధాటికి ఆ దేశంలో ఇప్పటికే 180 మంది మరణించారు. అయితే.. ఒక్క పంజాబ్ ప్రావిన్స్‌లో 54 మంది ఒకే రోజులో మరణించడం గమనార్హం.