
మంచి డ్రెస్, సూపర్ హెయిర్ స్టయిల్, బ్రైట్ మేకప్ ఇలా టాప్ టు బాటమ్ ఫుల్‌గా రెడీ అయ్యి, ఫేవరెట్ లొకేషన్‌లో ఫొటోషూట్‌కి స్టెప్పులేస్తూ చేరుకున్నారు. అప్పుడు వెంటనే, మీ ఫోన్ లేదా కెమెరా ‘బంగారం, నా బ్యాటరీ అయిపోయింది!’ అంటే ఎలా ఉంటుంది? ఊహించుకోండి. అప్పటిదాక అవార్డు విన్నర్‌లా మెరిసిన మీ ముఖం, ఒక్కసారిగా లోబ్యాటరీ లైట్‌లా డిమ్‌గా మారుతుంది.
ఇలా ఇంకెప్పుడు జరగకుండా ఉండాలనే, చాలా త్వరగా చార్జ్ చేసి, ఎక్కువ కాలం ఉండే ‘ఫాస్ట్ అండ్ ఫరెవర్’ అనే ఒక సూపర్ బ్యాటరీని జపాన్ ఇంజినీర్లు తయారు చేశారు. కేవలం మూడు నిమిషాల్లోనే ఈ బ్యాటరీ ఏ ఎలక్ట్రానిక్ డివైజ్‌నైనా పూర్తిగా చార్జ్ చేసేస్తుంది. దీనిని గాజు సిరామిక్ ఎలక్ట్రోలైట్, లిథియం వంటి ఇతర లోహాల మిశ్రమంతో తయారు చేశారు.
అందుకే, అధిక ఉష్ణోగ్రత, అధిక ఒత్తిడి వంటి క్లిష్టమైన పరిస్థితుల్లోనూ పనిచేస్తుంది. ఇప్పటి వరకు చేసిన పరిశోధనల్లో పదిహేనువేల సార్లు ఈ బ్యాటరీని ఉపయోగించి చార్జ్ చేసినా, ఇంకా తొంభై శాతం కెపాసిటీతో యథాతథంగా పనిచేస్తోంది. మొబైల్, ల్యాప్‌టాప్, కారు ఏదైనా సరే చిటికెలో చార్జ్ చేస్తుంది. దీంతో, ఈ బాటరీపై ఇప్పుడు భారీ క్రేజ్ ఉంది. డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని దీనిని విభిన్న పరిమాణాల్లో తయారు చేస్తున్నారు. త్వరలోనే ఇది మార్కెట్‌లోకి రానుంది.
(చదవండి: పసిడి దేశాలు..!)