టోక్యో: ప్రధాని నరేంద్ర మోదీ తన జపాన్ పర్యటనలో రెండవ రోజు జపాన్ ప్రధాని షిగేరు ఇషిబాతో పాటు బుల్లెట్ రైలులో ప్రయాణించారు. తూర్పు జపాన్ రైల్వే కంపెనీలో ప్రస్తుతం శిక్షణ పొందుతున్న భారత రైలు డ్రైవర్లతో సంభాషించారు. ఈ రైలులో ప్రయాణించేందుకు ఇద్దరు ప్రధానులు ముందుగా సెండాయ్ నగరానికి చేరుకున్నారు.
モディ首相と仙台へ。昨夜に引き続き、車内からご一緒します。 pic.twitter.com/ggE6DonklN
— 石破茂 (@shigeruishiba) August 30, 2025
జపాన్ ప్రధాని తన ‘ఎక్స్’ఖాతాలో బుల్లెట్ ప్రయాణానికి సంబంధించిన ఫొటోలను షేర్ చేశారు. ప్రస్తుతం జపాన్‌లో పలువురు భారత రైలు డ్రైవర్లు బుల్లెట్ రైలు నడపడంలో శిక్షణ పొందుతున్నారు. ప్రధాని మోదీ తన బుల్లెట్ రైలు ప్రయాణానికి ముందు ఆ డ్రైవర్లను కలిశారు. వారితో ఫోటోలు దిగారు. దీనికి ముందు ప్రధాని మోదీ టోక్యోలో పదహారు ప్రిఫెక్చర్‌ల గవర్నర్‌లతో సమావేశమయ్యారు. దీనికి సంబంధించిన ఫొటోలను ప్రధాని మోదీ సోషల్ మీడియాలో షేర్ చేశారు. 15వ వార్షిక ఇండియా-జపాన్ శిఖరాగ్ర సమావేశంలో ఇరుదేశాల సహకారంపై చర్చ జరిగిందని, వాణిజ్యం, ఆవిష్కరణలు, వ్యవస్థాపకత తదితర రంగాలలో పరస్పర సహకారానికి అపారమైన అవకాశాలున్నాయని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
JR東日本で研修中のインド人運転士さんたちとご挨拶。 pic.twitter.com/UXKoSVP50r
— 石破茂 (@shigeruishiba) August 30, 2025


