ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవల జపాన్ వెళ్లిన సంగతి తెలిసిందే.
సుకుమార్ దర్శకత్వంలో ఆయన హీరోగా నటించిన ‘పుష్ప 2: ది రూల్’ సినిమా జనవరి 16న జపనీస్ భాషలో విడుదలైంది.
ఈ మూవీ ప్రచారంలో భాగంగా బన్నీ, హీరోయిన్ రష్మిక మందన, మైత్రీ నిర్మాత వై. రవి శంకర్ కలిసి టోక్యో వెళ్లారు.
అక్కడ అభిమానులతో కలసి సందడి చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలను చిత్ర బృందం ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తోంది.


