
ట్రంప్‌పై జపాన్ ఆగ్రహం
టోక్యో: ఇరాన్‌పై ఇటీవల దాడులు జరిపిన అమెరికా, వాటిని రెండో ప్రపంచ యుద్ధాన్ని ముగించిన హిరోషిమా, నాగసాకిపై జరిగిన అణు బాంబు దాడులతో పోల్చడాన్ని జపాన్ తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన వ్యాఖ్యలు అణుబాంబు వేయడాన్ని సమర్థించినట్లుగా ఉన్నాయని నాగసాకి మేయర్ షిరో సుజుకి ఆక్షేపించారు. బాంబు దాడికి గురైన నగరవాసులుగా తాము చాలా విచారిస్తు న్నట్టు చెప్పారు.
ట్రంప్ వ్యాఖ్యలు ఆమోదయోగ్యం కాదని నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మిమాకి తోషియుకి అన్నారు. అణు బాంబు దాడి నుంచి బయటపడిన వారిలో ఆయన ఒకరు. ట్రంప్ ప్రక టనను ఉపసంహరించుకోవా లంటూ నాటి అణు బాంబు దాడుల నుండి బయటపడినవారు హిరోషి మాలో నిరసనకు దిగారు. ట్రంప్ ప్రకటన లను తిరస్కరిస్తూ హిరోషి మాలో చట్టసభ సభ్యు లు తీర్మానం ఆమోదించారు. సాయుధ పోరాటా లను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని పిలుపు నిచ్చారు.
‘‘ఇరాన్‌పై అమెరికా దాడి వల్లే యుద్ధా నికి తెరపడింది. హిరోషిమా, నాగసాకి ఉదాహ రణను నేను ఉపయోగించాలనుకోవడం లేదు. కానీ తప్పడం లేదు’’ అని ట్రంప్ పేర్కొనడం తెలిసిందే. ప్రపంచంలో అణు దాడికి గురైన ఏకైక దేశం జపాన్. 1945 ఆగస్టులో దక్షిణ జపాన్‌లోని రెండు నగరాలపై అమెరికా వేసిన అణు బాంబులు 1.4 లక్షల మందిని బలిగొ న్నాయి.
ప్రాణాలతో బయటపడినవారు నేటికీ నానా శారీరక, మానసిక వ్యాధులతో బాధపడు తున్నారు. అణ్వాయు ధాలకు జపాన్ వ్యతిరేకమని సూచించే శాంతి జ్వాల హిరోషిమాలో ఇప్పటికీ వెలుగుతూ ఉంటుంది. ప్రపంచంలోని చివరి అణు దాడి జరిగి ఎన్ని రోజులో తెలిపే గడియారం కూడా యుద్ధ మ్యూజి యం ప్రవేశద్వారం ఉంటుంది. శాంతి పట్ల తమ నిబద్ధత తెలియజేసేందుకు హిరోషిమాను సందర్శించే ప్రపంచ నాయకులతో కాగితపు క్రేన్లను తయారు చేయించే సంప్రదాయముంది.