International Yoga Day: ఉత్సాహంగా జపాన్‌ ప్రధాని భార్య యోషికో యోగాసనాలు | Japan PMs Wife Leads International Yoga Day 2025, Photos Goes Viral On Social Media | Sakshi
Sakshi News home page

International Yoga Day: ఉత్సాహంగా జపాన్‌ ప్రధాని భార్య యోషికో యోగాసనాలు

Jun 21 2025 10:42 AM | Updated on Jun 21 2025 11:45 AM

Japan PMs Wife Leads International Yoga Day

టోక్యో: ఈరోజు (జూన్‌ 21) అంతర్జాతీయ యోగా దినోత్సవం. ఈ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా పలు యోగా సంబంధిత కార్యక్రమాలు జరుగుతున్నాయి. జపాన్‌లోని టోక్యోలోగల భారత రాయబార కార్యాలయంలో11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం (ఐడీవై) ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రెండువేల మందికిపైగా ‍ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు. జపాన్ ప్రధాని షిగేరు ఇషిబా భార్య యోషికో ఇషిబా యోగా దినోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించారు.  
 

యోషికో ఇషిబా అందరితో పాటు యోగా ఆసనాలు వేయడంలో  ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. జపాన్ విదేశాంగ మంత్రి తకేషి ఇవాయా భార్య సతోకో ఇవాయా కూడా యోగా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఐడీవై ఈవెంట్‌ భారత్‌- జపాన్  దేశాల సాంస్కృతిక, దౌత్య సంబంధాలకు ప్రతీకగా నిలిచింది. జపాన్‌లో భారత రాయబారి సీబీ జార్జ్  మాట్లాడుతూ మనకు శారీరక, మానసిక ఆధ్యాత్మిక శ్రేయస్సును పెంపొందించడంలో యోగా ఎంతగానో దోహదపడుతుందన్నారు.

టోక్యోలో జరిగిన అంతర్జాతీయ యోగా దినోత్సవంలో రెండు వేలకు పైగా యోగా ఔత్సాహికులు పాల్గొనగా, రెవరెండ్ మైయోకెన్ హయామా, రెవరెండ్ టోమోహిరో కిమురా, సీనియర్ ప్రభుత్వ అధికారులు, రాయబారులు, దౌత్యవేత్తలు పాల్గొన్నారు. ఈ యోగా దినోత్సవ కార్యక్రమ వివరాలను భారత రాయబార కార్యాలయం ‘ఎక్స్‌’లో తెలిపింది.

ఇది కూడా చదవండి: ఇరాన్‌ కీలక డ్రోన్ కమాండర్ హతం: ఇజ్రాయెల్‌ వెల్లడి

Advertisement
 
Advertisement
Advertisement