భారత్‌కు మా సంపూర్ణ సహకారం: జపాన్‌ | Japanese Defense Minister offered full support to India | Sakshi
Sakshi News home page

భారత్‌కు మా సంపూర్ణ సహకారం: జపాన్‌

May 6 2025 5:56 AM | Updated on May 6 2025 5:56 AM

Japanese Defense Minister offered full support to India

న్యూఢిల్లీ: ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు ప్రపంచ దేశాలు కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరముందని భారత్, జపాన్‌ పేర్కొ న్నాయి. భారత్‌ లక్ష్యంగా సీమాంతర ఉగ్రవా దానికి పాల్పడే పాకిస్తాన్‌ విధానాన్ని ఖండించాయి. రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌తో సోమవారం జపాన్‌ రక్షణ మంత్రి జనరల్‌ నకటనీ ఢిల్లీలో సమావేశమయ్యారు. పాక్‌తో ఉద్రిక్తతలు ముదిరిన సమయంలో ఈ భేటీ జరగడం గమనార్హం.

 పహల్గాం ఉగ్ర ఘటన, తదనంతర పరిణామాలను సవివరంగా చర్చించారు. ఉగ్రవాదాన్ని రూపుమాపే విషయంలో భారత్‌కు తమ సంపూర్ణ సహకారం ఉంటుందని నకటనీ హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఇరువురు నేతలు రక్షణ రంగంలో సహకారం ప్రాంతీయ భద్రతకు సంబంధించిన అంశాలను చర్చించారు. సముద్రయానంతోపాటు యుద్ధ ట్యాంకుల ఇంజిన్లు, యుద్ధ విమానాల ఇంజిన్ల తయారీ రంగంలో సహకరించుకోవాలని నిర్ణయించారు. 

Advertisement
 
Advertisement
Advertisement