
మన దేశానికి చెందిన పన్నెండేళ్ల వాన్షీ మొదలియార్ జపాన్‌లోని టోక్యో ఒపెరా సిటీ కన్వర్ట్ హాల్‌లో జరిగిన ఇంటర్‌నేషనల్ ఆర్ట్ ఫెస్టివల్‌లో బంగారు పతకం గెలుచుకుంది. పాశ్చాత్య సంగీత పోటీలలో కనిపించే యూరప్, యూఎస్, రష్యా, జపాన్ కళాకారుల ఆధిపత్యాన్ని బ్రేక్ చేసింది వాన్షీ. ‘నా పేరు గోల్డ్ ఫస్ట్ ప్రైజ్‌కు ప్రకటించినప్పుడు సంతోషంగా అనిపించింది.
టోక్యో వేదిక మీద నిలబడి భారత్‌కు ప్రాతినిధ్యం వహించడం గర్వంగా అనిపించింది. ఇది నా ప్రయాణానికి ఆరంభం మాత్రమే’ అంటున్న వాన్షీ గత సంవత్సరం ఆస్ట్రియా రాజధాని వియన్నాలో జరిగిన ‘ఇంటర్నేషనల్ ఆర్ట్స్ ఫెస్టివల్’లో సిల్వర్ మెడల్ గెలుచుకుంది.
అయిదు సంవత్సరాల క్రితం మహారాష్ట్రలోని పుణెలో ‘రహెల్ అకాడమీ ఆఫ్ మ్యూజిక్’లో సంగీత ప్రయాణం ప్రారంభించింది వాన్షీ. ‘లండన్, న్యూయార్క్‌లలో ప్రదర్శనలు ఇవ్వాలనేది నా కోరిక. సంగీతానికి సరిహద్దులు లేవు. కొత్త భాషలు, కొత్త సంగీత రీతులు నేర్చుకోవాలనుకుంటున్నాను’ అంటుంది వాన్షీ.
(చదవండి: కైరాన్ అంటే మాటలు కాదు!)