
శాంట క్లారా యూనివర్శిటీలో యంగెస్ట్ గ్రాడ్యుయేట్‌గా అందరి దృష్టిని ఆకర్షించిన కైరాన్ క్వాజీ పద్నాలుగు సంవత్సరాల వయసులోనే ‘స్పేస్ ఎక్స్’లో స్టార్‌లింక్ విభాగంలో చేరి అందరినీ ఆశ్చర్యపరిచాడు.
ఇక అప్పటి నుంచి కైరాన్‌కు ప్రసిద్ధ ఏఐ ల్యాబోరేటరీలు, టెక్నాలజీ కంపెనీల నుంచి ఆఫర్లు వస్తూనే ఉన్నాయి. చివరికి ప్రపంచ ప్రసిద్ధ ప్రీమియర్ మార్కెట్ మేకింగ్ ఫర్మ్ సిటడెల్ సెక్యూరిటీస్‌ను ఎంపిక చేసుకున్నాడు. ‘స్పేస్ ఎక్స్’లో సాఫ్ట్‌వేర్ డిజైనింగ్, ప్రొడక్షన్–క్రిటికల్ సిస్టమ్స్‌పై పనిచేసేవాడు కైరాన్. సమర్థతకు వయసు అడ్డు కాదని తన నియామకం ద్వారా తెలియజేసిన ‘సిటడెల్ సెక్యూరిటీస్’కు కైరాన్ కృతజ్ఞతలు చెప్పాడు.
కైరాన్ క్వాజీ బంగ్లాదేశి–అమెరికన్. తొమ్మిది సంవత్సరాల వయసులోనే థర్డ్ గ్రేడ్ నుండి కాలేజీలో చేరాడు. పది సంవత్సరాల వయసులో ‘ఇంటెల్ ల్యాబ్స్’లో ఇంటర్న్‌షిప్ చేశాడు. మన్‌హట్టన్‌లో ఉంటున్న కైరాన్ రోజూ పది నిమిషాలు నడిచి ‘స్సేస్ ఎక్స్’ ఆఫీసుకు నడిచి వెళ్లేవాడు. ‘నడకలో గొప్ప ఆలోచనలు వస్తాయి’ అంటారు. అందుకే ఏమో!