ముగ్గురు కళాశాల డ్రాపౌట్‌లు 22 ఏళ్లకే బిలియనీర్ క్లబ్‌లోకి ప్రవేశించారు. తద్వారా మెటా అధిపతి మార్క్ జుకర్‌బర్గ్ రికార్డును చెరిపేశారు. ఫోర్బ్స్ ప్రకారం, మెర్కోర్ (Mercor )అనే AI-ఆధారిత రిక్రూటింగ్స్టార్టప్ వ్యవస్థాపకులైన ముగ్గురుస్నేహితులు బ్రెండన్ ఫుడీ, ఆదర్శ్ హిరేమత్, సూర్య మిధా,ప్రపంచంలోనే అతి చిన్న బిలియనీర్లుగా నిలిచారు. ఈ ముగ్గురూ, స్వయంకృషితో బిలయనీర్లుగా ఎదిగారు. వీరిలో హిరేమత్ భారతీయసంతతికి చెందినవాడు కావడం విశేషం.
శాన్‌ఫ్రాన్సిస్కోకు చెందిన మెర్కోర్ కంపెనీ ప్రస్తుత విలువ రూ. 88,560.68 కోట్లకు (10 బిలియన్ డాలర్లు)గా ఉంది. 350 మిలియన్ల డాలర్ల తాజా నిధులతో కంపెనీ వాల్యుయేషన్ ఈ స్థాయికి ఎగిసింది. దీంతో ప్రపంచంలోనే అతి పిన్న వయస్కులైన సెల్ఫ్-మేడ్ బిలియనీర్లుగా ఈ ముగ్గురూ నిలిచారు. మెర్కోర్ సీఈవో బ్రెండన్ ఫుడీ, CTO ఆదర్శ్ హిరేమత్ , బోర్డు చైర్మన్ సూర్య మిధా టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచారు.
ఈ ముగ్గురి ప్రయాణంకాలిఫోర్నియాలోని శాన్‌జోస్‌లోని బెల్లార్మైన్ కాలేజ్ ప్రిపరేటరీ బోయిస్ స్కూలు నుంచే మొదలైంది.అక్కడ డిబేట్ టీమ్‌లో టాప్ మెంబర్స్‌గా పేరు తెచ్చుకున్నారు. ఒకే సంవత్సరంలో మూడు మేజర్ పాలసీ డిబేట్ టోర్నమెంట్స్ గెలుచు కున్న తొలి వ్యక్తులు.
హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో కంప్యూటర్ సైన్స్ చదువుతున్న సమయంలో మెర్కోర్‌పై పూర్తి సమయం దృష్టి పెట్టడానికి చదువును విడిచి పెట్టాల్సి వచ్చింది. మెర్కోర్‌లో పని చేయకపోతే, రెండు నెలల క్రితమే పట్టభద్రుడయ్యేవాడినని, ఇంతలోనే తన జీవితం 180-డిగ్రీల యు-టర్న్ తీసుకుందని పేర్కొన్నాడు. అలాగే సూర్య మిధా జార్జ్‌టౌన్ యూనివర్సిటీలో ఆర్థిక శాస్త్రం చదువుతున్న సమయంలోనే బ్రెండన్ ఫుడీని కలిశాడు. దీంతో హిరేమత్‌తో పాటు మిధా, ఫుడీ ఇద్దరూ తమ చదువును వదిలేశారు. అలా వారి అభిరుచులు కలిసి, నైపుణ్యాన్ని మేళవించి మెర్కోర్ నాంది పలికింది. ప్రపంచ రికార్డుకు దారి తీసింది.

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
