
ప్రాణానికి ప్రాణంగా ప్రేమించినవాళ్లు మనల్ని వదిలేసి ఎక్కడికీ వెళ్లరు. ఒకవేళ తనువు చాలించి వెళ్లిపోయినా మళ్లీ ఏదో ఒక రూపంలో మనముందుకు వస్తారని చాలామంది బలంగా నమ్ముతారు. హీరోయిన్ అనస్వర రాజన్ (Anaswara Rajan) ఇంట అదే నిజమైంది. సూపర్ శరణ్య, నెరు, రేఖా చిత్రం వంటి పలు హిట్ సినిమాల్లో నటించింది అనస్వర.
నా పాపాయికి హ్యాపీ బర్త్‌డే
నేడు (సెప్టెంబర్ 8) ఆమె బర్త్‌డే. ఈ సందర్భంగా హీరోయిన్ తల్లి ఉషా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఓ పోస్ట్ పెట్టింది. ఆరోజు నేనెంతో ప్రేమించిన వ్యక్తిని కోల్పోయాను.. అదే రోజు నువ్వు జన్మించావు. 23 ఏళ్ల ఈ పాపాయి ఆయురారోగ్యాలతో జీవించాలని మనసారా కోరుకుంటున్నాను. అమ్మ నీకోసం వేవేల బర్త్‌డే విషెస్ తెలియజేస్తోంది అని రాసుకొచ్చింది. ఈ పోస్ట్‌కు అనస్వర ఫోటోను జత చేసింది. దీంతో అభిమానులు హీరోయిన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
సినిమా
కాగా ఉషా- రాజన్ దంపతులకు 2002 సెప్టెంబర్ 8న అనస్వర జన్మించింది. ఈమె పుట్టడానికి ముందు ఉషా తల్లి మరణించింది. తల్లిని కోల్పోయి పుట్టెడు శోకంలో మునిగిన ఉషాకు కూతురే ప్రపంచంగా మారింది. అనస్వరలోనే తల్లిని చూసుకుని సంతోషపడిపోయింది. అనస్వర రాజన్ సినిమాల విషయానికి వస్తే.. 7/G రెయిన్‌బో కాలనీ 2 సినిమా చేస్తోంది. ఇది తెలుగులో7/G బృందావన కాలనీ 2గా విడుదల కానుంది. దీనితో పాటు మరో రెండు మూవీస్ చేస్తోంది.
చదవండి: 15 మంది పనోళ్లు.. కూతుళ్లు లేరు, కొడుకూ లేడు, అందుకే..