అభిషన్ జీవింత్, అనశ్వర రాజన్ జంటగా నటిస్తోన్న లవ్ ఎంటర్‌టైనర్ 'విత్ లవ్'. ఈ ప్రేమకథ చిత్రానికి మదన్ దర్శకత్వం వహించారు. ఈ మూవీని జియాన్ ఫిల్మ్స్, ఎంఆర్పీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై సౌందర్య రజనీకాంత్, మగేష్ రాజ్ నిర్మించారు. తాజాగా ఈ మూవీ తెలుగు టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.
టీజర్ చూస్తుంటే ఫుల్ లవ్ ఎంటర్‌టైనర్‌గానే తెరకెక్కించినట్లు తెలుస్తోంది. తమిళంలో తెరకెక్కించిన ఈ మూవీని విత్ లవ్ పేరుతో తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. తాజాగా తెలుగు టైటిల్ రివీల్ చేయడంతో పాటు టీజర్ రిలీజ్ చేశారు. ఈ చిత్రంలో హరీష్ కుమార్, కావ్య అనిల్, సచ్చిన్ నాచియప్పన్, తేని మురుగన్, శరవణన్ కీలక పాత్రల్లో నటించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా ఫిబ్రవరి 6న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ చిత్రానికి సీన్ రోల్డాన్ సంగీతమందించారు.
It’s here! The Title Teaser and First look of #WithLove
Check it out 💥
🔗 https://t.co/UvJynh5a20
Starring @Abishanjeevinth & @AnaswaraRajan_ ♥️
A @RSeanRoldan musical 🎶
Written & Directed by @madhann_n♥️
Produced by @soundaryaarajni &♥️ @mageshraj@MRP_ENTERTAIN… pic.twitter.com/faeMQcT7zN— Suresh Productions (@SureshProdns) January 21, 2026


