breaking news
Gandhi Talks Movie
-
ఈ వారం ఓటీటీల్లోకి 13 సినిమాలు.. ఆ మూడు డోంట్ మిస్
2026లో రెండు నెలలు పూర్తయిపోయాయి. మార్చి వచ్చేసింది. అలానే కొత్తవారం కూడా మొదలైంది. ఈ వీకెండ్ థియేటర్లలోకి మృత్యుంజయ్, సరస్వతి, సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని, చైనా పీస్, కాక్రోచ్, మెన్షన్ హౌస్ మల్లేష్, సతీ లీలావతి తదితర తెలుగు సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. మరోవైపు ఓటీటీల్లోనూ 13కి పైగా కొత్త మూవీస్ స్ట్రీమింగ్ కానున్నాయి.(ఇదీ చదవండి: అల్లు శిరీష్ 'పెళ్లి కొడుకు' వేడుక.. ఫొటోలు, వీడియో వైరల్)ఓటీటీల్లోకి వచ్చే సినిమాల విషయానికొస్తే.. ఓం శాంతి శాంతి శాంతిః లాంటి తెలుగు చిత్రంతో పాటు విత్ లవ్, గాంధీ టాక్స్ అనే డబ్బింగ్ మూవీస్ ఇదే వీకెండ్ అందుబాటులోకి వస్తాయి. అలానే రవితేజ 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' కూడా ఓటీటీలోకి వస్తుందేమో చూడాలి. సంక్రాంతికి థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం ఇప్పటివరకు రాలేదు. బహుశా ఈ వారం రావొచ్చేమో చూడాలి? ఇంతకీ ఏ ఓటీటీలోకి ఏ మూవీ రానుందంటే?ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ (మార్చి 02 నుంచి 08 వరకు)నెట్ఫ్లిక్స్విత్ లవ్ (తెలుగు డబ్బింగ్ సినిమా) - మార్చి 06హలో బచ్చోన్ (హిందీ సిరీస్) - మార్చి 06వార్ మెషీన్ (ఇంగ్లీష్ సినిమా) - మార్చి 06అమెజాన్ ప్రైమ్తన్వి ద గ్రేట్ (హిందీ మూవీ) - మార్చి 03యంగ్ షెర్లాక్ (ఇంగ్లీష్ సిరీస్) - మార్చి 04సుబేదార్ (హిందీ సినిమా) - మార్చి 05హాట్స్టార్విక్రమ్ ఆన్ డ్యూటీ (తెలుగు సిరీస్) - మార్చి 06ఆహాఓం శాంతి శాంతి శాంతిః (తెలుగు సినిమా) - మార్చి 04సోనీ లివ్లాలో కృష్ణ సదా సహాయతే (హిందీ మూవీ) - మార్చి 06సన్ నెక్స్ట్డియర్ రథి (తమిళ సినిమా) - మార్చి 06గ్రానీ (తమిళ మూవీ) - మార్చి 06జీ5గాంధీ టాక్స్ (తెలుగు డబ్బింగ్ సినిమా) - మార్చి 06జబ్ కూలీ కితాబ్ (హిందీ మూవీ) - మార్చి 06(ఇదీ చదవండి: సీఎం ఇంట్లో కొత్త పెళ్లికూతురు రష్మిక.. ఫొటోలు వైరల్) -
మరో ఓటీటీలోకి 'గాంధీ టాక్స్'.. తెలుగు స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ప్రస్తుతం పాన్ ఇండియా, భారీ బడ్జెట్ యాక్షన్ సినిమాలు అనే మాటే ఎక్కువగా వినిపిస్తోంది. ఇలాంటి టైంలో మూకీ చిత్రం తీశారంటే సాహసమనే చెప్పొచ్చు. తాజాగా అది జరిగింది కూడా. విజయ్ సేతుపతి, అదితీ రావు హైదరీ, అరవిందస్వామి ప్రధాన పాత్రల్లో 'గాంధీ టాక్స్' అనే మూవీ తీశారు. గత నెలలో థియేటర్లలోకి కూడా తీసుకొచ్చారు. తాజాగా ఈ చిత్ర తెలుగు స్ట్రీమింగ్ గురించి అధికారిక ప్రకటన వచ్చేసింది.(ఇదీ చదవండి: అపచారం.. తిరుమల గుడి ముందే 'బిగ్‌బాస్' భామ డ్యాన్సులు)శుక్రవారం (ఫిబ్రవరి 27) నుంచి ఈ సినిమా.. అమెజాన్ ప్రైమ్‌లోకి సైలెంట్‌గా స్ట్రీమింగ్‌లోకి వచ్చేసింది. కాకపోతే ప్రస్తుతం అద్దె విధానంలో అందుబాటులో ఉంది. ఇప్పుడు జీ5 ఓటీటీలోకి మార్చి 06 నుంచి అందుబాటులోకి రానుందని ప్రకటించారు. తెలుగు, తమిళ, మలయాళ వెర్షన్స్ స్ట్రీమింగ్ అవుతాయని క్లారిటీ ఇచ్చారు. ఇది మూకీ సినిమానే కాబట్టి భాషతో సంబంధం లేకుండా ఎవరైనా చూడొచ్చు. భావాన్ని అర్థం చేసుకోవచ్చు.'గాంధీ టాక్స్' విషయానికొస్తే.. ముంబైలోని ధారావిలో ఉండే పేదకుర్రాడు మహాదేవ్ విష్ణు(విజయ్ సేతుపతి). మున్సిపాలిటీలో ఉద్యోగం కోసం ప్రయత్నించగా రూ.50 వేలు లంచం అడుగుతారు. తల్లి ఆరోగ్య పరిస్థితి బాగుపడాలన్నా, ప్రేమించిన అమ్మాయి(అదితీ రావు హైదరీ) దక్కాలన్నా ఈ జాబ్ కీలకం. దీంతో ఆ డబ్బు కోసం ఓ తప్పుడు పనికి సిద్ధపడతాడు. ఇదే ముంబైలో బోస్మన్ (అరవింద స్వామి)ది మరో కథ. బిజినెస్‌మ్యాన్ అయినప్పటికీ ఘోరమైన నష్టాలొచ్చి రోడ్డున పడతాడు. ఈ సమస్య నుంచి బయటపడేందుకు ఓ ఆలోచన చేస్తాడు. ఇంతకీ అదేంటి? విష్ణు, బోస్మన్ జీవితాలని డబ్బు ఎలా కలిపింది? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: ఓటీటీలోకి గుజరాతీ హిట్ సినిమా.. రూ.50 లక్షలతో తీస్తే రూ.100 కోట్ల కలెక్షన్) -
ఓటీటీలో విజయ్ సేతుపతి, అరవింద్ స్వామి మూకీ సినిమా
విజయ్ సేతుపతి, అరవింద్ స్వామి, అదితీ రావు హైదరీ నటించిన సైలెంట్ మూవీ 'గాంధీ టాక్స్' ఓటీటీలోకి వచ్చేసింది. జనవరి 30న థియేటర్లో విడుదలైన ఈ మూవీ ప్రేక్షకులను మెప్పించింది. వెండితెరపై మూకీ చిత్రాల యుగం ఎప్పుడో ముగిసింది. ఇలాంటి తరుణంలో ‘గాంధీ టాక్స్’ పేరుతో ఓ నిశ్శబ్ద చిత్రాన్ని దర్శకుడు కిశోర్ తెరకెక్కించారు. ఇందులో ఒక్క డైలాగ్ కూడా వినిపించదు. కానీ, ఏ.ఆర్. రెహమాన్ సంగీతం అలరిస్తుంది.‘గాంధీ టాక్స్’(Gandhi Talks) అమెజాన్ ప్రైమ్(amazon prime video)లో సడెన్‌గా స్ట్రీమింగ్కు వచ్చేసింది. అయితే, ఈ మూవీని చూడాలంటే రూ. 279 అధనంగా చెల్లించాల్సి ఉంటుంది. తమిళ్ వర్షన్లో ఈ చిత్రం తెరకెక్కినప్పటికీ డైలాగ్స్ ఉండవ్ కాబట్టి భాషతో సంబంధం లేకుండా ఎవరైనా చూడొచ్చు. కానీ, ఇంగ్లీష్‌లో సబ్‌టైటిల్స్ ఉంటాయి.కథేంటి..?దేశంలోని ఆర్థిక పరిస్థితిలు ఆపై నిరుద్యోగం, అవినీతి వంటి అంశాలను సున్నితంగా స్పృశిస్తూ గాంధీ టాక్స్ కథ సాగుతుంది. డబ్బు అందరి జీవితాల్ని ఎలా ప్రభావితం చేస్తుందో ఈ మూవీలో చూపించారు. ముంబయి ధారావిలో జీవించే నిరుపేద కుర్రాడు మహాదేవ్ విష్ణు (విజయ్ సేతుపతి). చదువుకు తగిన ఉద్యోగం రాకపోవడంతో ముంబై నగర మున్సిపాలిటీలో ఉద్యోగం కోసం ప్రయత్నించగా రూ.50 వేలు లంచం అడుగుతారు. ఇంట్లో అనారోగ్యంతో ఉన్న తల్లి మరోవైపు ప్రేమించిన అమ్మాయి (అదితీ రావ్ హైదరి)ని పెళ్లి చేసుకోవాలనే తపన.. అందుకోసం తనకు ఆ ఉద్యోగం చాలా అవసరం. అయితే, ఉద్యోగం దక్కాలంటే లంచం ఇవ్వాలి.. ఆ డబ్బు కోసం నైతిక విలువల్ని పక్కకు పెట్టి ఒక తప్పుడు పని చేసేందుకు రెడీ అవుతాడు. అదే ముంబైలో బోస్మన్ (అరవింద్ స్వామి) బిగ్గెస్ట్ బిజినెస్‌మెన్‌గా రాణిస్తుంటాడు. అయితే, తన వ్యాపారంలో నష్టం రావడంతో రోడ్డున పడుతాడు. ఆర్థిక సమస్యల్లో చిక్కుకున్న బోస్మన్ బయటపడేందుకు ఎలాంటి ప్లాన్ చేశాడు. మహాదేవ్ విష్ణు, బోస్ మన్లు ఇద్దరూ ఎలా కలుసుకున్నారు. డబ్బు వల్ల వారిద్దరి జీవితాలు ఎలా మారిపోయాయి..? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. -
విజయ్ సేతుపతి మూకీ సినిమా.. ట్రైలర్ రిలీజ్
పేరుకే తమిళ నటుడు అయినప్పటికీ పాన్ ఇండియా లెవల్ గుర్తింపు తెచ్చుకున్న విజయ్ సేతుపతి నుంచి ఇప్పుడు ఓ మూకీ సినిమా రాబోతుంది. అదే 'గాంధీ టాక్స్'. నాలుగేళ్ల క్రితమే ఈ ప్రాజెక్టుని మొదలుపెట్టారు గానీ ఇన్నాళ్లకు థియేటర్లలో విడుదలకు సిద్ధమైంది. ఈ శుక్రవారమే (జనవరి 30) ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మేరకు తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు 'దేవర' నిర్మాత గుడ్‌న్యూస్)ఇందులో విజయ్ సేతుపతి సరసన అదితీ రావు హైదరీ హీరోయిన్. అరవింద స్వామి కీలక పాత్రధారి. కిశోర్ పి బెలేకర్ దర్శకత్వం వహించారు. ప్రతి స్టోరీకి మాటలు అవసరం లేదు. కొన్ని చూడటంతోనే మనసుని హత్తుకుంటాయి. ఈసారి స్క్రీన్ పై మాటలుండవు. అది మిమ్మల్ని వినేలా మాత్రమే చేస్తుంది అని ట్రైలర్‌తో చెప్పుకొచ్చారు. డబ్బు అనేది నలుగురు వ్యక్తుల జీవితాల్లో ఎలాంటి పరిణామాలకు కారణమైంది అనేది ఇందులో చూపించబోతున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీతమందించాడు.(ఇదీ చదవండి: ఓటీటీలో కార్తీ 'అన్నగారు వస్తారు' సినిమా.. డైరెక్ట్‌గా స్ట్రీమింగ్)


