పేరుకే తమిళ నటుడు అయినప్పటికీ పాన్ ఇండియా లెవల్ గుర్తింపు తెచ్చుకున్న విజయ్ సేతుపతి నుంచి ఇప్పుడు ఓ మూకీ సినిమా రాబోతుంది. అదే 'గాంధీ టాక్స్'. నాలుగేళ్ల క్రితమే ఈ ప్రాజెక్టుని మొదలుపెట్టారు గానీ ఇన్నాళ్లకు థియేటర్లలో విడుదలకు సిద్ధమైంది. ఈ శుక్రవారమే (జనవరి 30) ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మేరకు తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు.
(ఇదీ చదవండి: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు 'దేవర' నిర్మాత గుడ్‌న్యూస్)
ఇందులో విజయ్ సేతుపతి సరసన అదితీ రావు హైదరీ హీరోయిన్. అరవింద స్వామి కీలక పాత్రధారి. కిశోర్ పి బెలేకర్ దర్శకత్వం వహించారు. ప్రతి స్టోరీకి మాటలు అవసరం లేదు. కొన్ని చూడటంతోనే మనసుని హత్తుకుంటాయి. ఈసారి స్క్రీన్ పై మాటలుండవు. అది మిమ్మల్ని వినేలా మాత్రమే చేస్తుంది అని ట్రైలర్‌తో చెప్పుకొచ్చారు. డబ్బు అనేది నలుగురు వ్యక్తుల జీవితాల్లో ఎలాంటి పరిణామాలకు కారణమైంది అనేది ఇందులో చూపించబోతున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీతమందించాడు.
(ఇదీ చదవండి: ఓటీటీలో కార్తీ 'అన్నగారు వస్తారు' సినిమా.. డైరెక్ట్‌గా స్ట్రీమింగ్)


