breaking news
With Love Movie
-
పెట్టింది చీమంతా.. వచ్చింది కొండంతా.. ఆ సినిమాలు ఇవే!
వందల కోట్లు ఖర్చు చేసినా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టిన చిత్రాలు కోలీవుడ్‌లో చాలానే ఉన్నాయి. పరిమిత బడ్జెట్‌తో తెరకెక్కి అంచనాలను తారుమారు చేసిన తమిళ సినిమాలూ ఉన్నాయి. స్టార్డమ్తో పనిలేకుండా కథలో దమ్ముండి బాక్సాఫీస్ వద్ద ఈ ఏడాది భారీ వసూళ్లు రాబట్టిన కొన్ని తమిళ సినిమాల కోసం ఓ లుక్కేద్దాం..!విత్ లవ్:‘టూరిస్ట్ ఫ్యామిలీ’ సినిమాతో సత్తా చాటిన యువ దర్శకుడు అభిషన్ జీవింత్ హీరోగా ప్రేక్షకుల ముందుకొచ్చిన చిత్రం ‘విత్ లవ్’. ఇందులో ఛాంపియన్ బ్యూటీ అనస్వర రాజన్ హీరోయిన్గా నటించింది. మదన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సౌందర్య రజనీకాంత్, మాగేశ్ రాజ్ కలిసి నిర్మించారు. కేవలం రూ.4 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుని ఏకంగా రూ.39 కోట్ల వసూళ్లను రాబట్టింది.తాయ్ కిళవి:ఒకప్పటి హీరోయిన్ రాధిక ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ తమిళ సూపర్‌హిట్ చిత్రం ‘తాయ్ కిళవి’. రాధికను లీడ్ రోల్లో పెట్టి తమిళ హీరో శివకార్తికేయన్ నిర్మించిన ఈ సినిమా ఎవరూ ఊహించని విధంగా బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకుంది. రూ.10 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం ఏకంగా రూ.82 కోట్ల మేర వసూళ్లను సాధించింది.యూత్:తమిళ నటుడు కరుణాస్ వారసుడు కెన్ కరుణాస్ హీరోగా పరిచయమైన చిత్రం ‘యూత్’. ఈ సినిమాకు కెన్ కరుణాస్ దర్శకత్వం వహించారు. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందించారు. కురప్పయ్య సీ రామ్, సులోచన కుమార్ నిర్మించిన ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. రూ.8 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా ఏకంగా రూ.81 కోట్ల వసూళ్లు రాబట్టింది.బ్లాస్ట్:అర్జున్ సర్జా, అభిరామి, ప్రీతి ముకుందన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘బ్లాస్ట్’. తెలుగులో ‘బ్లాస్ట్ జోన్’ పేరుతో విడుదలైంది. సుభాష్ కె.రాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ నిర్మించింది. రవి బస్రూర్ సంగీతం అందించారు. లీడ్ రోల్స్‌లో నటించిన వారు పెద్ద స్టార్లు కాకపోయినా.. ఈ సినిమా పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. రూ.18 కోట్లతో తెరకెక్కిన ఈ చిత్రం రూ.75 కోట్ల వసూళ్లను రాబట్టింది. -
ఈ వారం ఓటీటీల్లోకి 13 సినిమాలు.. ఆ మూడు డోంట్ మిస్
2026లో రెండు నెలలు పూర్తయిపోయాయి. మార్చి వచ్చేసింది. అలానే కొత్తవారం కూడా మొదలైంది. ఈ వీకెండ్ థియేటర్లలోకి మృత్యుంజయ్, సరస్వతి, సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని, చైనా పీస్, కాక్రోచ్, మెన్షన్ హౌస్ మల్లేష్, సతీ లీలావతి తదితర తెలుగు సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. మరోవైపు ఓటీటీల్లోనూ 13కి పైగా కొత్త మూవీస్ స్ట్రీమింగ్ కానున్నాయి.(ఇదీ చదవండి: అల్లు శిరీష్ 'పెళ్లి కొడుకు' వేడుక.. ఫొటోలు, వీడియో వైరల్)ఓటీటీల్లోకి వచ్చే సినిమాల విషయానికొస్తే.. ఓం శాంతి శాంతి శాంతిః లాంటి తెలుగు చిత్రంతో పాటు విత్ లవ్, గాంధీ టాక్స్ అనే డబ్బింగ్ మూవీస్ ఇదే వీకెండ్ అందుబాటులోకి వస్తాయి. అలానే రవితేజ 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' కూడా ఓటీటీలోకి వస్తుందేమో చూడాలి. సంక్రాంతికి థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం ఇప్పటివరకు రాలేదు. బహుశా ఈ వారం రావొచ్చేమో చూడాలి? ఇంతకీ ఏ ఓటీటీలోకి ఏ మూవీ రానుందంటే?ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ (మార్చి 02 నుంచి 08 వరకు)నెట్ఫ్లిక్స్విత్ లవ్ (తెలుగు డబ్బింగ్ సినిమా) - మార్చి 06హలో బచ్చోన్ (హిందీ సిరీస్) - మార్చి 06వార్ మెషీన్ (ఇంగ్లీష్ సినిమా) - మార్చి 06అమెజాన్ ప్రైమ్తన్వి ద గ్రేట్ (హిందీ మూవీ) - మార్చి 03యంగ్ షెర్లాక్ (ఇంగ్లీష్ సిరీస్) - మార్చి 04సుబేదార్ (హిందీ సినిమా) - మార్చి 05హాట్స్టార్విక్రమ్ ఆన్ డ్యూటీ (తెలుగు సిరీస్) - మార్చి 06ఆహాఓం శాంతి శాంతి శాంతిః (తెలుగు సినిమా) - మార్చి 04సోనీ లివ్లాలో కృష్ణ సదా సహాయతే (హిందీ మూవీ) - మార్చి 06సన్ నెక్స్ట్డియర్ రథి (తమిళ సినిమా) - మార్చి 06గ్రానీ (తమిళ మూవీ) - మార్చి 06జీ5గాంధీ టాక్స్ (తెలుగు డబ్బింగ్ సినిమా) - మార్చి 06జబ్ కూలీ కితాబ్ (హిందీ మూవీ) - మార్చి 06(ఇదీ చదవండి: సీఎం ఇంట్లో కొత్త పెళ్లికూతురు రష్మిక.. ఫొటోలు వైరల్)


