Uttar Pradesh: మూడు రోడ్డు ప్రమాదాలు.. 11 మంది మృతి | 11 Killed in Three Road Accidents Across Uttar Pradesh | Sakshi
Sakshi News home page

Uttar Pradesh: మూడు రోడ్డు ప్రమాదాలు.. 11 మంది మృతి

Jun 18 2025 10:23 AM | Updated on Jun 18 2025 10:28 AM

11 Killed in Three Road Accidents Across Uttar Pradesh

ఆగ్రా: ఉత్తరప్రదేశ్‌లో జరిగిన మూడు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో 11 మంది మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. ఢిల్లీ నుండి బీహార్‌కు వెళ్తున్న బస్సు ఆగ్రా-లక్నో ఎక్స్‌ప్రెస్‌వేపై ఒక ట్రక్కును ఢీకొంది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా, 15 మంది  గాయపడ్డారు. బాధితులను చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునేందుకు పోలీసు అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.
 

బులంద్‌షహర్ జిల్లాలో జహంగీరాబాద్-బులంద్‌షహర్ రహదారిపై జానిపూర్ గ్రామం సమీపంలో ఒక వాహనం వంతెనను ఢీకొని, అనంతరం బోల్తా పడి, మంటల్లో చిక్కుకోవడంతో ఐదుగురు మృతిచెందగా, ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. బులంద్‌షహర్ ఎస్పీ (గ్రామీణ) తేజ్‌వీర్ సింగ్ తెలిపిన వివరాల ప్రకారం ఉదయం 5.50 గంటల ప్రాంతంలో  ఈ ప్రమాదం జరిగింది. బుదౌన్‌లో జరిగిన వివాహానికి హాజరైన పెళ్లి బృందం ఢిల్లీలోని మాలవీయ నగర్‌కు తిరిగి వెళుతుండగా, ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు.

ఆగ్రాలో జరిగిన మరో విషాదకర ఘటనలో ఒక పికప్ వాహనం బ్యాలెన్స్ కోల్పోయి సహద్ర ఫ్లైఓవర్‌పై నుంచి కింద పడింది. అది నేరుగా మార్నింగ్ వాకర్స్‌పై పడిపోవడంతో నలుగురు మృతి చెందారు. ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసు అధికారి హేమంత్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం పికప్ వాహనం మామిడి పండ్లను రవాణా చేస్తుండగా, ఈ ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ కూడా మృతిచెందాడు. అతని సహాయకుని పరిస్థితి విషమంగా ఉంది. ఈ మూడు కేసులను నమోదు చేసుకున్న ఆయా ప్రాంతాల పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

 

ఇది కూడా చదవండి: శుభాంశు రోదసియాత్ర మళ్లీ వాయిదా

 

Advertisement
 
Advertisement
Advertisement