ముప్పు తప్పినంతనే మరో ఘోరం.. ఆరుగురు మృతి | Maharashtra News: Back to Back Road Accident | Sakshi
Sakshi News home page

ముప్పు తప్పినంతనే మరో ఘోరం.. ఆరుగురు మృతి

May 27 2025 12:06 PM | Updated on May 27 2025 12:32 PM

Maharashtra News: Back to Back Road Accident

మహారాష్ట్రలోని బీడ్‌ జిల్లాల్లో ఘోర రోడ్డు ప్రమాదం(Road accident) చోటుచేసుకుంది. గాంధీ వంతెనపై జరిగిన ఈ రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతిచెందారు. అత్యంత అనూహ్య రీతిలో ఈ ప్రమాదం జరిగింది. వివరాల్లోకి వెళితే ధూలే-సోలాపూర్ జాతీయ రహదారిపై ఒక ఎస్‌యూవీ వాహనం డివైడర్‌ను ఢీకొంది. దీంతో అప్రమత్తమైన ఎస్‌యూవీలోని ఆరుగురు ప్రయాణికులు కిందకు దిగారు. ఇంతలో అటుగా వేగంగా వచ్చిన ఒక ట్రక్కు వారిని ఢీకొంది. దీంతో వారు అక్కడికక్కడే మృతిచెందారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఈ ప్రమాదం రాత్రి 11 గంటల సమయంలో జరిగింది. బీడ్ పోలీసు సూపరింటెండెంట్ నవనీత్ కన్వత్  ఈ ప్రమాదం గురించి మాట్లాడుతూ గెవ్రాయ్ పట్టణానికి సమీపంలోని ధూలే-సోలాపూర్ జాతీయ రహదారిలోని గాంధీ వంతెనపై ఒక ఎస్‌యూవీ డివైడర్‌ను ఢీకొట్టిందని, ఈ ప్రమాదంలో వాహనంలో ఉన్న ఆరుగురిలో ఎవరికీ గాయాలు కాలేదన్నారు. అయితే డివైడర్ నుండి తమ వాహనాన్ని పక్కకు తప్పించేందుకు వారు ప్రయత్నిస్తుండగా, అటుగా వేగంగా వచ్చిన ఒక ట్రక్కు వారిని ఢీకొన్నదని తెలిపారు. ఈ ప్రమాదంలో ఆ ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారని పేర్కొన్నారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించి, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని కన్వత్‌  తెలిపారు.

ఇది కూడా చదవండి: Nehru Death Anniversary: చైనాతో ఓటమిని జీర్ణించుకోలేక..

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement