
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోగ్యంపై పలు ఊహాగానాలు చెలరేగుతున్నాయి. తాజాగా వైరల్ అవుతున్న ఒక టిక్‌టాక్ వీడియోలో అధ్యక్షుడు ట్రంప్ మరో ఆరు నుండి ఎనిమిది నెలల మాత్రమే బతుకుతారనే వాదన వినిపిస్తోంది. ఎపిస్టెమిక్ క్రైసిస్ అనే ఖాతాలో పోస్ట్ అయిన ఈ వీడియోలో, తనను డాక్టరేట్ పొందిన హోమ్ హెల్త్ ఫిజికల్ థెరపిస్ట్ అని చెప్పుకుంటున్న వ్యక్తి.. అధ్యక్షుడు ట్రంప్.. కంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్, క్రానిక్ కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారని వెల్లడించాడు.
‘ఆయనకు కంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్ ఉందని నాకు తెలుసు. ఆయన పాదాలు, చీలమండలలో వాపు దీనికి సంకేతం. వాపు మరింత తీవ్రమవుతోందని మాకు తెలుసు. అందుకే ఆయన బహిరంగ సభల సమయంలో డెస్క్ వెనుక కూర్చుంటున్నారు. ఈ సంకేతాలను చూస్తుంటే, ట్రంప్ ఇంకో ఆరు నుండి ఎనిమిది నెలలు మాత్రమే బతకవచ్చని’ అన్నారు.
I’ve watched this 4 times so far. 😌
Credit: epistemiccrisis on TikTok pic.twitter.com/M4FUoANHHg— Annalea 🪷🐝🥑🍁🌻🍌 (@citizengatsby) August 23, 2025
దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జే మ్యుంగ్‌తో ఇటీవల జరిగిన సమావేశంలో, కార్యనిర్వాహక ఉత్తర్వులపై సంతకం చేస్తున్నప్పుడు ట్రంప్ చేతులపై నున్న గాయాల ఫోటోలు వైరల్‌గా మారాయి. దీంతో ట్రంప్ ఆరోగ్యంపై పలువురిలో ఆందోళన చోటుచేసుకుంది. పలు ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. గతంలో ఈ గాయాలను మేకప్‌తో దాచడంతో, ఇవి మీడియా దృష్టి నుంచి ఆకర్షించలేదనే మాట వినిపిస్తోంది.
తాజా ఊహాగానాలకు ఆజ్యం పోస్తూ, కొందరు అధ్యక్షుడు ట్రంప్ చాలాకాలంగా ఎదురుగా కెమెరాలున్నప్పుడు డెస్క్ వెనుకగా కూర్చుంటున్న విషయాన్ని గుర్తుచేస్తున్నారు. చీలమండ వాపు అనేది హృద్రోగ లేదా మూత్రపిండాల వ్యాధులకు సంబంధించినదని వారు అంటున్నారు. ఈ ఊహాగానాల నేపధ్యంలో వైట్ హౌస్ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేస్తూ, ఈ వాదనలను ఖండించింది. అధ్యక్షుడు ట్రంప్ ప్రజల మనిషి. అతను చరిత్రలో నిలిచిపోతాడు. ప్రతిరోజూ అధిక సంఖ్యలో ప్రజలను కలుస్తూ, వారితో కరచాలనం చేస్తున్నారు. అతని నిబద్ధత అచంచలమైనది. ప్రతిరోజూ దానిని రుజువు చేస్తున్నారంటూ అని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ పేర్కొన్నారు.