
సాక్షి, తాడేపల్లి: కమలమ్మ మృతిపై వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. హెలికాప్టర్ ప్రమాదంలో నాన్నతో పాటు మృతి చెందిన చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ అద్దంకి సాల్మన్ కేరి వెస్లీ వర్ధంతి రోజునే ఆయన మాతృమూర్తి కమలమ్మ మృతి చెందడం బాధాకరమన్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబానికి దేవుడు ధైర్యం ప్రసాదించాలని ప్రార్థిస్తున్నానని వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.
హెలికాప్టర్ ప్రమాదంలో నాన్నతో పాటు మృతి చెందిన చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ అద్దంకి సాల్మన్ కేరి వెస్లీ వర్ధంతి రోజునే ఆయన మాతృమూర్తి కమలమ్మ మృతి చెందడం బాధాకరం. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబానికి దేవుడు ధైర్యం ప్రసాదించాలని ప్రార్థిస్తున్నా.
— YS Jagan Mohan Reddy (@ysjagan) September 3, 2025