
రియాసి: జమ్ముకశ్మీర్‌లోని రియాసి పరిధిలోని మహోర్ ప్రాంతంలోగల బద్దర్ గ్రామంలో ఒక ఇంటిపై కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మృతిచెందారు. క్లౌడ్ బరస్ట్ అనంతరం వారి మట్టి ఇల్లు కొండ చరియల కింద శిధిలమయ్యింది.
ఈ ఘటన గురించి మహోర్ ఎమ్మెల్యే మొహమ్మద్ ఖుర్షీద్ మాట్లాడుతూ కొండచరియలు విరిగిపడిన సమయంలో ఆ కుటుంబంలోని వారంతా నిద్రలో ఉన్నారని, ఇల్లు కూలడంతో వారు శిథిలాల కింద సమాధి అయ్యారని తెలిపారు. స్థానికులు అప్రమత్తమై, సహాయక చర్యలు చేపట్టి ఏడు మృతదేహాలను వెలికితీశారు.
#KNSUPDATE || Anguished by the cloudburst & rain-triggered landslides in Reasi & Ramban. Condolences to the bereaved families. Spoke to Senior Officials and took stock of the situation. Rescue and relief operations are underway. All possible assistance is being provided to the… pic.twitter.com/jZJr9nCTj9
— KNS (@KNSKashmir) August 30, 2025
మృతులను నజీర్ అహ్మద్, వజీరా బేగం, బిలాల్ అహ్మద్, మహ్మద్ ముస్తఫా, మహ్మద్ ఆదిల్, మహ్మద్ ముబారక్, మహ్మద్ వసీమ్‌గా పోలీసులు గుర్తించారు. దీనికి ముందు రంబన్ జిల్లాలోని రాజ్‌గడ్ ప్రాంతంలో క్లౌడ్ బరస్ట్ కారణంగా సంభవించిన విపత్తులలో ముగ్గురు మృతిచెందారు. శనివారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. ప్రస్తుతం ఆ ప్రాంతంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.