అమెరికాలో దారుణం.. | Ukrainian Refugee Iryna Zarutska American Train Incident | Sakshi
Sakshi News home page

అమెరికాలో దారుణం..

Sep 7 2025 12:04 PM | Updated on Sep 7 2025 12:04 PM

Ukrainian Refugee Iryna Zarutska American Train Incident

వాషింగ్టన్‌: అగ్రరాజ్యం అమెరికాలో షాకింగ్‌ ఘటన చోటుచేసుకుంది. అమెరికాకు శరణార్థిగా వచ్చిన ఉక్రెయిన్‌ మహిళ దారుణ హత్యకు గురైంది. ఆమె రైలులో ప్రయాణిస్తున్న సమయంలో ఓ వ్యక్తి కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

వివరాల ప్రకారం.. రష్యా-ఉక్రెయిన్‌ల మధ్య యుద్ధం కొనసాగుతున్న కారణంగా యుద్ధభూమిలో ఉండలేక ప్రశాంతమైన జీవితం కోసం ఉక్రెయిన్‌ మహిళ ఇరినా జరుత్స్కాను (23) అమెరికాకు శరణార్థిగా వచ్చారు. అయితే, ఆగస్టు 22న నార్త్‌ కరోలినాలోని షార్లెట్‌లో ఆమె రైల్లో ప్రయాణిస్తున్న సమయంలో షాకింగ్‌ ఘటన చోటుచేసుకుంది.

ఆమె వెనుక కూర్చున్న నిందితుడు డెకార్లోస్‌ బ్రౌన్‌ జూనియర్‌.. ఇరినాను కత్తితో పొడిచి చంపేశాడు. అనంతరం నిందితుడు తర్వాతి స్టాప్‌లో దిగిపోయాడు. ఈ ఘటనతో రైలులోని ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు. కాగా, ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు. దాడికి ఉపయోగించిన కత్తిని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని.. అతడికి నేరచరిత్ర ఉన్నట్లు వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement