
సాక్షి, తాడేపల్లి: మాజీ మంత్రి దామోదర్ రెడ్డి మృతిపై వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. మా కుటుంబానికి సన్నిహితులు, మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి మృతి బాధాకరం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన కుటుంబ సభ్యులకు ధైర్యం ప్రసాదించాలని దేవుడిని ప్రార్థిస్తున్నా’’ అంటూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.
కాగా, ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ‘టైగర్ దామన్న’గా సుపరిచితులైన మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రాంరెడ్డి దామోదర్‌రెడ్డి కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్సపొందుతూ బుధవారం రాత్రి తుది శ్వాస విడిచారు. ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం పాతలింగాల గ్రామంలో రాంరెడ్డి నారాయణరెడ్డి, కమలాదేవి దంపతులకు రాంరెడ్డి దామోదర్‌రెడ్డి 1952 సెప్టెంబర్ 14న జన్మించారు.
మా కుటుంబానికి సన్నిహితులు, మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డిగారి మృతి బాధాకరం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన కుటుంబ సభ్యులకు ధైర్యం ప్రసాదించాలని దేవుడిని ప్రార్థిస్తున్నా. pic.twitter.com/5fqvyDE7Oa
— YS Jagan Mohan Reddy (@ysjagan) October 2, 2025
ఉమ్మడి నల్లగొండ జిల్లా కాంగ్రెస్ జిల్లా రాజకీయాల్లో దామోదర్‌రెడ్డిది ప్రత్యేక స్థానం. కమ్యూనిస్టుల కంచుకోటగా ఉన్న ఉమ్మడి జిల్లాలో దామోదర్‌రెడ్డి రాజకీయ ప్రవేశంతో తుంగతుర్తిలో రాజకీయం మారిపోయింది. కమ్యూనిస్టులు, టీడీపీ ప్రభంజనం కొనసాగుతున్న రోజుల్లో దామన్న, ఆయన సతీమణి ‘వరూధినీదేవిని వెంటబెట్టుకుని జిల్లాలో పర్యటించి పార్టీ బలోపేతానికి కృషి చేశారు. కమ్యూనిస్టు యోధులు భీంరెడ్డి నర్సింహారెడ్డి, మల్లు స్వరాజ్యం గెలుపొందిన తుంగతుర్తి నుంచి ఆయన నాలుగుసార్లు గెలుపొందడం విశేషం. వైఎస్ రాజశేఖరరెడ్డి పీసీసీ ప్రెసిడెంట్‌గా ఉన్న సమయంలోనే సూర్యాపేటలో బహిరంగ సభలు, ఖమ్మం జిల్లాలో సదస్సులు పెట్టి పార్టీలో ’టైగర్ దామన్న’గా గుర్తింపు పొందారు.