సాక్షి, డా. బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా: ఇరుసుమండలో మరో వారం పాటు బ్లో అవుట్ కొనసాగుతోందని జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ తెలిపారు. ఇప్పటివరకు ఎటువంటి ఆస్తి, ప్రాణం నష్టం జరగలేదన్నారు. ధ్వంసమైన కొబ్బరి చెట్లకు, దెబ్బతిన్న పంటలకు సమీపంలో పంట పొలాలకు పరిహారం చెల్లిస్తామన్నారు. బ్లో అవుట్ ఒకేసారి కాకుండా క్రీమేపి తగ్గించే ప్రయత్నం జరుగుతోందని కలెక్టర్ తెలిపారు.
ఐదు వైపులా పైపులతో వాటర్ అంబ్రెల్లా కొనసాగుతుంది. పూర్తిస్థాయిలో బ్లోట్ అదుపులోకి రావడానికి వారం రోజులు పడుతుందన్నారు. టెక్నాలజీ అండ్ ఫీల్డ్ సర్వీసెస్ డైరెక్టర్ విక్రమ్ సక్సేనా మాట్లాడుతూ.. బ్లో అవుట్ సంభవించిన మోరి- 5 వెల్‌ను డీప్ ఇండస్ట్రీకి 15 ఏళ్లకు లీజుకి ఇచ్చామని తెలిపారు. బ్లో అవుట్ వల్ల ఎటువంటి సమస్య తలెత్తదన్నారు.


