
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లోని రీజెంట్ పార్క్ ప్రాంతంలో విషాద ఘటన చోటుచేసుకుంది. రాష్ట్రంలో జాతీయ పౌర రిజిస్టర్ (ఎన్‌ఆర్‌సీ) అమలు చేస్తే, తనను బంగ్లాదేశ్‌కు పంపుతారనే భయంతో దిలీప్ కుమార్ సాహా(63) ఆత్మహత్య చేసుకున్నాడని అతని కుటుంబ సభ్యులు తెలిపారు.
కోల్‌కతాలోని తన ఇంట్లో దిలీప్ కుమార్ సాహా ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో దిలీప్ కుమార్ సాహా 1972లో ఢాకాలోని నవాబ్‌గంజ్ నుండి కోల్‌కతాకు వచ్చాడు. ఇక్కడి రీజెంట్ పార్క్ ప్రాంతంలోని ఆనందపల్లి వెస్ట్‌లో నివసిస్తున్నాడు. సాహా దక్షిణ కోల్‌కతాలోని ధకురియాలోని ఒక ప్రైవేట్ పాఠశాలలో బోధనేతర సిబ్బందిగా పనిచేశాడు. అతను ఉంటున్న ఇంటికి అతని భార్య పలుమార్లు ఫోన్ చేసింది.
అయితే అతని నుంచి ఎటువంటి స్పందన రాలేదు. దీంతో ఆమె పొరుగింట్లో ఉంటున్న మేనకోడలికి ఫోన్ చేసింది. ఆమె.. దిలీప్ కుమార్ సాహా ఇంటి తలుపులను పగలగొట్టి, లోనికి చూడగా అతను సీలింగ్ ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించాడని పోలీసులు తెలిపారు. ఈ సందర్భంగా అతని భార్య ఆరతి సాహా మీడియాతో మాట్లాడుతూ ఎన్‌ఆర్‌సీ అమలు తర్వాత బంగ్లాదేశ్‌కు బహిష్కరిస్తారేమోనని తన భర్త ఆందోళన చెందుతుండేవాడని తెలిపారు. కాగా దిలీప్ కుమార్ సాహా గది నుంచి పోలీసులు ఒక సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఉదంతంపై దర్యాప్తు జరుగుతోందని పోలీసులు తెలిపారు. విషయం తెలుసుకున్న విద్యుత్ మంత్రి, స్థానిక తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అరూప్ బిశ్వాస్ కుటుంబ సభ్యులతో మాట్లాడి, వారిని ఓదార్చారు.