
నందూర్బార్: మహారాష్ట్రలోని నందూర్బార్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. భక్తులను తీసుకెళ్తున్న పికప్ వాహనం లోయలోకి దూసుకెళ్లిన ఘటనలో 8 మంది మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. బాధితులను చికిత్స కోసం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.
మీడియాకు అందిన వివరాల ప్రకారం.. పికప్ వాహనం అస్తంబ దేవి యాత్ర ముగించుకుని వస్తున్న భక్తులను తీసుకెళుతోంది. ఇంతలో ఘాట్ మలుపు వద్ద డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో, బస్సు అదుపుతప్పి లోతైన లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది అక్కడికక్కడే మృతిచెందగా, పలువురు గాయపడ్డారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసు బృందం సంఘటనా స్థలానికి చేరుకుని, సహాయక చర్యలను చేపట్టింది. గాయపడిన వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు.
Maharashtra: 8 dead after vehicle falls into a valley at Chandshaili Ghat
Read @ANI Story | https://t.co/QJOc5iOuif#Maharashtra #death #vehicle #valley #ChandshailiGhat pic.twitter.com/aWT4EHMtjB— ANI Digital (@ani_digital) October 18, 2025
ఈ ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. బాధితులను గుర్తించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అస్తంబ దేవి యాత్రకు హాజరైన భక్తులు తమ గ్రామానికి తిరిగి వెళుతుండగా ఈ విషాద సంఘటన చోటుచేసుకుంది. ప్రమాదం జరిగిన ప్రదేశంలో బీతావహ దృశ్యాలు కనిపిస్తున్నాయి. బోల్తా పడిన వాహనం కింద పలువురు చిక్కుకున్నారు. ప్రమాదానికి గల కారణం ఏమిటన్నది ఇంకా తెలియరాలేదు.