
ముంబై: దేశంలో అత్యంత రద్దీగా ఉండే ఎక్స్‌ప్రెస్ వేల్లో ఒకటైన ముంబై-పుణె ఎక్స్‌ప్రెస్ వేపై జరిగిన రోడ్డు ప్రమాదంలో 18 నుంచి 20 వాహనాల వరకూ ఒకదానికొకటి ఢీకొన్నాయి. వీటిలో కనీసం మూడు వాహనాల వరకూ పూర్తిగా నుజ్జునుజ్జు కాగా, మరికొన్ని వాహనాలు పాక్షికంగా దెబ్బతిన్నాయి.
శనివారం(జూలై 26) మధ్యాహ్నం వేళ చోటు చేసుకున్న ఈ ప్రమాదంలో పలువురు గాయపడ్డారు. అంతే కాకుండా ఐదు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది.
లోనావాలా ఖాందార్ ఘాట్ వద్ద.. ఓ కంటైనర్ ట్రక్కు బ్రేకులు ఫెయిల్ కావడంతో ముందున్న వెహికల్‌ను ఢీకొట్టింది. ఇలా కార్లు చైన్ సిస్టమ్ మాదిరి ఒకదాని వెంటే మరొకటి ఢీకొట్టుకున్నాయి. కంటైనర్.. ఒక్కసారిగా బ్రేకులు ఫెయిల్ కావడంతో ముందు ఉన్న వాహనాన్ని అత్యంత బలంగా ఢీకొట్టడంతో ఆ వాహనం పూర్తిగా దెబ్బతింది. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న రెస్క్యూ టీమ్.. సహాయక చర్యలు చేపట్టింది
ఈ ఎక్స్‌ప్రెస్ వే పై నిత్యం లక్షన్నర నుంచి రెండు లక్షల వరకూ వాహనాల రద్దీ ఉంటుంది. అదే వీకెండ్‌లలో అయితే మరింత ఎక్కువగా ఉంటుంది. ఈ రోజు వీకెండ్ కావడంతో ఆ రద్దీ మరింత ఎక్కువగా ఉందని స్థానికులు చెబుతున్నారు. అత్యవసర విభాగాలు హుటాహుటీ ఇక్కడకు చేరుకుని గాయపడ్డ వారికి సహాయక చర్యలు చేపట్టాయి.
Monsoon: Wet Concrete + cluster driving without Safe Braking Distance Gap.
Worse pileup crash, 15 vehicles…3 similar accident within 10 Days, Krishnagiri, Assam & now this one.@DriveSmart_IN @dabir
Mumbai - Pune Expressway
pic.twitter.com/3Kdd8pKSpV— Dave (Road Safety: City & Highways) (@motordave2) July 26, 2025