శ్రీవారిని దర్శించుకుని వెళుతుండగా.. | Two Died in Road Accident | Sakshi
Sakshi News home page

శ్రీవారిని దర్శించుకుని వెళుతుండగా..

Sep 26 2015 8:30 AM | Updated on Oct 8 2018 5:45 PM

తిరుమల వెంకటేశ్వరుడిని దర్శించుకుని మహారాష్ట్రకు తిరుగు ప్రయాణమైన ఓ భక్త బృందం శనివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదంలో చిక్కుకుంది.

తిరుమల వెంకటేశ్వరుడిని దర్శించుకుని మహారాష్ట్రకు తిరుగు ప్రయాణమైన ఓ భక్త బృందం శనివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదంలో చిక్కుకుంది. వారు ప్రయాణిస్తున్న స్కార్పియో వాహనాన్ని కడప జిల్లా ఓబులవారిపల్లె మండలం కిన్నెవోరంపాడు పంచాయతీ పరిధిలోని కమ్మపల్లి వద్ద జాతీయ రహదారిపై గుర్తు తెలియని వాహనం ఢీకొని వెళ్లిపోయింది. ఈ ప్రమాదంలో స్కార్పియోలో ఉన్న ఇద్దరు మృతి చెందారు. మరో నలుగురికి గాయాలు అయ్యాయి. వారిని తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను రాజంపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.
 

Advertisement
 
Advertisement
Advertisement