
సాక్షి, తాడేపల్లి: నూజివీడు సీడ్స్ లిమిటెడ్ వ్యవస్థాపకులు మండవ వెంకటరామయ్య మృతిపై వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. నూజివీడు సీడ్స్‌ను ఏర్పాటు చేసి లక్షలాది మంది రైతులకు నాణ్యమైన విత్తనాలను అందిస్తూ.. భారతదేశంలోని అతి పెద్ద హైబ్రీడ్ సీడ్ కంపెనీలలో ఒకటిగా రూపొందించేందుకు వెంకటరామయ్య చేసిన కృషిని ఎవరూ మరిచిపోలేరు. వెంకటరామయ్య కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను’’ అని వైఎస్ జగన్ పేర్కొన్నారు.
మండవ వెంకటరామయ్య కుటుంబాన్ని వైఎస్ జగన్ పరామర్శించారు. వెంకటరామయ్య కుమారుడు ప్రభాకర్‌రావుతో ఫోన్‌లో మాట్లాడారు. హైబ్రీడ్ సీడ్‌స్ విషయంలో వెంకటరామయ్య చేసిన కృషిని ఎవరూ మరిచిపోలేరన్నారు. వెంకటరామయ్య కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
నూజివీడు మండలంలోని తుక్కులూరుకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త, నూజివీడు సీడ్స్ చైర్మన్ మండవ వెంకట్రామయ్య (94) సోమవారం ఉదయం 7.30 సమయంలో తన స్వగృహంలో మృతిచెందారు. ఆయనకు భార్య, ఇరువురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. కుమారుడు మండవ ప్రభాకర్‌రావు నూజివీడు సీడ్స్ ఎండీగా ఉన్నారు. ప్రముఖులు తుక్కులూరు వచ్చి వెంకట్రామయ్య భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు.