
సాక్షి, హనుమకొండ జిల్లా: హనుమకొండ నయీం నగర్‌లోని తేజస్వి స్కూల్‌లో విషాదం చోటుచేసుకుంది. మైదానంలో ఆడుకుంటూ అకస్మాత్తుగా కిందపడి టెన్త్ విద్యార్థి జయంత్‌వర్ధన్(15) మృతి చెందాడు. రోజులాగే ఉదయం పాఠశాలకు వెళ్లిన విద్యార్థి మధ్యాహ్నం స్పోర్ట్స్ ఆడుతుండగా అకస్మాత్తుగా మృతి చెందినట్టు కుటుంబ సభ్యులకు స్కూల్ యాజమాన్యం సమాచారం ఇచ్చింది. బాలుడి ముక్కు నుంచి రక్తం ఆనవాళ్లు ఉన్నాయని తల్లిదండ్రులు చెబుతున్నారు.
కొట్టి చంపేశారని అనుమానం ఉందని తల్లితండ్రులు ఆరోపిస్తున్నారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీసీ కెమెరాల ఫుటేజ్‌ను పోలీసులు పరిశీలిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.