‘నేను కదా ఫోన్‌ ట్యాపింగ్‌ బాధితుడ్ని.. నన్ను కదా పిలవాల్సింది’ | BJP MP Raghunandan Rao On SIT Investigation | Sakshi
Sakshi News home page

‘నేను కదా ఫోన్‌ ట్యాపింగ్‌ బాధితుడ్ని.. నన్ను కదా పిలవాల్సింది’

Jun 27 2025 4:01 PM | Updated on Jun 27 2025 6:13 PM

BJP MP Raghunandan Rao On SIT Investigation

హైదరాబాద్:  తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు విచారణపై బీజేపీ ఎంపీ రఘునందన్‌ రావు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అసలు ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో సిట్‌ విచారణ ఎటు పోతుందో అర్థం కావడం లేదన్నారు. తాను దుబ్బాక ఉప ఎన్నికల టైమ్‌లోనే తన ఫోన్‌ ట్యాపింగ్‌ జరిగిందని ఫిర్యాదు ఇచ్చానని,  కానీ ఇప్పటివరకూ తనను విచారణకు పిలవలేదన్నారు. కానీ ఈ కేసుకు సంబంధం లేని కాంగ్రెస్‌ నేతలను విచారణకు పిలుస్తున్నారన్నారంటూ అసహనం వ్యక్తం చేశారు. 

తాను అసలు ఫోన్‌ ట్యాపింగ్‌ బాధితుడినని, తనను విచారణకు పిలవకుంటా ఎవరెవరినో పిలుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.   ఈ కేసును గాంధీ భవన్‌, జూబ్లీహిల్స్‌ మధ్య పంచాయతీలా మార్చారని, సిట్‌కు చిత్తశుద్ధి లేదని విమర్శించారు. డైలీ సీరియల్‌లా రోజుకొకరిని పిలుస్తున్నారని,  కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌లు ములాఖత్‌ అయ్యి పని చేస్తున్నాయనడానికి ఇదే నిదర్శనమన్నారు. 

కాళేశ్వరం కమిషన్, ట్యాపింగ్ కేసులో చివరగా ప్రజల ముందు ప్రభుత్వం పెట్టేది గాడిద గుడ్డే.  కాంంగ్రెస్‌కు కేసులలో చిత్తశుద్ధి లేదు. ఇండిరమ్మ ఇళ్లు రైతు భరోసాలో చిత్తశుద్ధి లేదు. కేవలం ప్రచార ఆర్భాటాలే తప్ప మరో ధ్యాసే లేదు’ అని రఘునందన్‌రావు మండిపడ్డారు.

అన్నపూర్ణా క్యాంటీన్ల పేరు ఎందుకు మారుస్తున్నారు?
జీహెచ్‌ఎంసీలో అన్నపూర్ణ క్యాంటీన్ల పేరు మార్పుపై రఘునందన్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఇంగితజ్ఞానం పక్కన పెట్టి అన్నపూర్ణ క్యాంటిన్ల పేర్లు మార్చారన్నారు. పేర్ల మార్పుతో డైవర్షన్‌ పాలనను కాంగ్రెస్‌ కొనసాగిస్తోంది. బల్దియాలో పరిష్కరించాల్సిన సమస్యలు చాలానే ఉన్నాయి. మేయర్‌ కనీసం అవగాహనతో మాట్లాడాలి. కాంగ్రెస్ పాలన చూసి గ్రామాల్లో ప్రజలు నవ్వుకుంటున్నారు’ అని విమర్శించారు. 

ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణ ఎటు పోతోంది: రఘునందన్ రావు

Advertisement
 
Advertisement
Advertisement