సాక్షి, హైదరాబాద్: బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను తెలంగాణ ఉద్యమకారుడని అదే తన గుర్తింపన్నారు. తనకు ఎప్పుడు తెలంగాణనే ఫస్ట్ అని దాని తర్వాతే పార్టీ అని కుండబద్దలు కొట్టారు. ఈటల వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర పొలిటికల్ వర్గాల్లో హాట్ టాఫిక్‌గా మారాయి. ''ఎవరి మెప్పుకోసమో, ఎవరో స్క్రిప్ట్ రాసిస్తేనో.. ఎవరో పలికిస్తేనో పలికే రకం కాదు. మేము స్వయం ప్రకాశులం. సొంత జ్థానం, అవగాహన, కమిట్‌మెంట్ ఉన్నవాళం మేము. నేను రిమోట్‌కంట్రోల్ లాంటివాడిని కాదు. రాజకీయాల ముసుగులో ప్రజల జీవితాలతో చెలగాటమాడుతుంటే చూస్తూ ఊరుకోను'' అని ఈటల అన్నారు.
ఎగువ రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు పడి తెలంగాణ ప్రాజెక్టులోకి నీళ్లు వస్తున్నా ప్రభుత్వం మాత్రం అలసత్వం ప్రదర్శిస్తోందన్నారు. ప్రభుత్వం మోటార్లు ఆన్ చేయకుండా రైతులను కష్టాల పాలు చేయడం సరైంది కాదన్నారు. వర్షాకాలం పంటలకు నీళ్లు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారని, ఇందుకు ప్రభుత్వ వైఖరే కారణమన్నారు.


