పక్కా ప్రణాళిక లేకుండా నిర్మాణాలు
మౌలిక వసతులు మరిచిన వైనం
ట్రాఫిక్ ఇబ్బందులు, ప్రమాదాలు
ఇప్పటికైనా మార్పులు అనివార్యం
సాక్షి, హైదరాబాద్: ఏదైనా ఓ ప్రాంతంలో ట్రాఫిక్ జామ్‌లతో పాటు ప్రయాణ సమయం.. వాహన వేగం పెంచడం.. ప్రధానంగా ఈ ఉద్దేశాలతోనే ఫ్లైఓవర్ నిర్మిస్తారు. ప్రస్తుతం నగరంలోని అనేక పైవంతెనలు కొత్త సమస్యల్ని సృష్టిస్తున్నాయి. మరికొన్నింటి వద్ద ఆద్యంతాల్లో తీవ్ర ట్రాఫిక్ జామ్‌లకు కారణమవుతున్నాయి. పక్కా ప్రణాళికలు లేకుండా నిర్మించడమే ప్రధాన హేతువు. ప్రస్తుతం రాజధాని నగరంలో కొన్ని ఫ్లైఓవర్ల నిర్మాణాలు జరుగుతుండగా... మరికొన్నింటి ప్రతిపాదనలు వివిధ స్థాయుల్లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో గత అనుభవాల దృష్ట్యా ముందుకెళ్లాల్సిన అవసరముందని నిపుణులు సూచిస్తున్నారు.
మార్పునకు నోచుకోని తెలంగాణ తల్లి ఫ్లై ఓవర్ డిజైన్..
సిటీ నడి»ొడ్డున 1.1 కి.మీ పొడవుతో నిర్మాతమైన నాటి తెలుగుతల్లి, నేటి తెలంగాణ తల్లి ఫ్లైఓవర్‌ది మరో క«థ. ఇక్బాల్ మీనార్– కట్టమైసమ్మ దేవాలయం మధ్య నిర్మించిన దీని డిజైన్‌నూ మార్చాలని అప్పట్లోనే అనేక మంది నిపుణులు సూచించారు. ప్రస్తుతం ఉన్న మార్గంలో కంటే ఇటు ఇక్బాల్ మీనార్... అటు లిబర్టీ జంక్షన్లను దాటేలా డిజైన్‌లో మార్పులు చేస్తే ఫలితాలుంటాయన్నా.. ఎవరూ పట్టించుకోలేదు.

కొత్తవాటిది మరో కథ..
ఇవన్నీ ఏళ్ల క్రితం నిర్మించిన ఫ్లైఓవర్లు. గడిచిన 10–12 ఏళ్ల కాలంలో నిర్మితమైన వాటిలోనూ అనేక ఇబ్బందులు ఉన్నాయి. ప్రధానంగా నాయిని నరసింహారెడ్డి స్టీల్ బ్రిడ్జ్, షేక్‌పేట్ ఫ్లైఓవర్, ఏఎంబీ మాల్ ఫ్లైఓవర్‌లతో పాటు కేబుల్ బ్రిడ్జికి అనుసంధానించిన రోడ్ నెం.45 ఫ్లైఓవర్లు ట్రాఫిక్ జామ్‌కు ప్రధాన కేంద్రాలుగా ఉన్నాయి. వీటికి అటో/ఇటో ఉన్న ఇంజినీరింగ్ లోపాల కారణంగా ఆయా చోట్ల భారీగా ట్రాఫిక్ నిలిచిపోతోంది. ఫలితంగా అప్పటి వరకు వేగంగా వచ్చిన వాహన చోదకులు మొదట, చివర చిక్కుకుపోతున్నారు.


