
సాక్షి,కరీంనగర్: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని తొలిసారి వెలుగులోకి తీసుకువచ్చిన కేంద్ర మంత్రి బండి సంజయ్‌కు సిట్ నోటీసులు జారీ చేసింది.
ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు హాజరు కావాలని ఎంపీ బండి సంజయ్‌కు నోటీసులు జారీ చేసింది. కేంద్ర మంత్రితో పాటు పీఆర్వో, పీఏలకూ సిట్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈమేరకు సిట్ విచారణలో హైదరాబాద్ లేక్ వ్యూ గెస్ట్ హౌస్‌లో స్టేట్‌మెంట్ ఇచ్చేందుకు అంగీకరించారు. అదే రోజు పీఆర్వో, పీఏల స్టేట్‌మెంట్‌ను సిట్ పోలీసులు రికార్డ్ చేయనుంది. ఈ మేరకు కొద్దిసేపటి క్రితం సిట్ అధికారులు కేంద్ర మంత్రి నివాసానికి వెళ్లి నోటీసులు అందించారు.