
మాజీ ఎస్‌ఐబీ చీఫ్ ప్రభాకర్‌రావు(ఫైల్‌ఫోటో)
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక సూత్రధారి, ఎస్‌ఐబీ(special intelligence bureau) మాజీ చీఫ్ ప్రభాకర్‌రావు విచారణ ముగిసింది. సుమారు 8 గంటలపాటు ఆయన్ని ప్రశ్నించిన డీసీపీ విజయ్ కుమార్ నేతృత్వంలోని ప్రత్యేక దర్యాప్తు బృందం స్టేట్‌మెంట్‌ను రికార్డు చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఈ నెల 11వ తేదీన మరోసారి విచారణకు రావాలంటూ ఆయన్ని కోరినట్లు సమాచారం.
మరోవైపు.. ఇవాళ్టి విచారణలో ఆయన అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వకపోగా.. సిట్‌కే ఎదురు ప్రశ్నలు వేసినట్లు సమాచారం. ఫోన్ ట్యాపింగ్‌కు తాను ఆదేశాలు ఇవ్వలేదని.. అలా చెప్పినట్లు ఆధారాలు చూపించాలని సిట్ అధికారులను ఆయన కోరినట్లు తెలుస్తోంది. తాను ఎఫ్‌ఐబీలో పనిచేస్తున్నప్పటికీ తనపై అధికారులు ఉన్నారని.. తన పైఅధికారులకు తాను చేసిన ప్రతీ పనీ తెలుసని ఆయన స్టేట్‌మెంట్ ఇచ్చారు. అయితే అడిగిన ప్రశ్నలకు వివరణ ఇవ్వకపోవడంతో మరోసారి విచారణకు రావాలని సిట్ కోరింది.
తాను చేసిన ప్రతీ పనికి నిరంతర పర్యవేక్షణ ఉంటందని, వారికి తెలియకుఉండా తాను ఏ పనీ చేయలేదన్నారు. అయితే ఎస్‌ఐబీ కార్యాలయంలో ధ్వంసమైన హార్డ్ డిస్క్‌కు సంబంధించి ఎలాంటి సమాచారాన్ని సిట్ అధికారులకు ప్రభాకర్‌రావు చెప్పలేనట్లుగా తెలుస్తోంది.
కాగా, గత ప్రభుత్వంలో ఎస్‌ఐబీ చీఫ్‌గా ఉండి ట్యాపింగ్‌కు పాల్పడినట్లు ఆయనపై ఆరోపణలు వచ్చాయి. రాజకీయ, సినీ ప్రముఖలు, జడ్జిలు, జర్నలిస్టుల ఫోన్లు ట్యాప్ చేసినట్లు ఆరోపణలున్నాయి. ఇంతకాలం అమెరికాలో ఉన్న ప్రభాకర్‌రావు సుప్రీం కోర్టు ఆదేశాలతో నిన్న (ఆదివారం, జూన్8) హైదరాబాద్ చేరుకున్నారు.