ఫోన్ ట్యాపింగ్ కేసు.. సిట్‌ కీలక నిర్ణయం! | Prabhakar Rao: Sit Key Decision In Phone Tapping Case | Sakshi
Sakshi News home page

ఫోన్ ట్యాపింగ్ కేసు.. సిట్‌ కీలక నిర్ణయం!

Jun 19 2025 3:05 PM | Updated on Jun 19 2025 3:33 PM

Prabhakar Rao: Sit Key Decision In Phone Tapping Case

సాక్షి, హైదరాబాద్: ఫోన్‌ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో సిట్‌ దూకుడు పెంచింది. ప్రభాకర్‌రావు వ్యవహారంలో సిట్ బృందం కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. త్వరలో సుప్రీంకోర్టును పోలీసులు ఆశ్రయించనున్నారు. ప్రభాకర్‌రావు విచారణకు సహకరించడం లేదంటున్న సిట్‌.. ఈ నేపథ్యంలో ఆయనకు ఇచ్చిన రిలీఫ్ రద్దు చేయాలని కోరనున్నట్లు సమాచారం. మరో వైపు ప్రభాకర్‌రావును కస్టోడియల్ విచారణ చేసేందుకు నాంపల్లి కోర్టులో పిటిషన్ వేసే అవకాశం ఉంది.

ఇప్పటికే మూడుసార్లు ప్రభాకర్‌రావుని విచారించిన పోలీసులు.. నాలుగోసారి కూడా విచారిస్తున్నారు. పలువురు సీనియర్ అధికారుల పేర్లు చెప్పడంతో రివ్యూ కమిటీ సభ్యులను పోలీసులు విచారించారు. త్వరలో మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి స్టేట్‌మెంట్‌ను సైతం పోలీసులు సైతం రికార్డ్‌ చేయనున్నారు. నిందితుల విచారణతో పాటు సాక్షుల వాంగ్మూలాలు కూడా సిట్‌ అధికారులు సేకరిస్తున్నారు.

ఫోన్ ట్యాపింగ్ కోసం టెలికాం సర్వీసెస్‌కు పంపిన నంబర్లపై సిట్‌ ఆరా తీస్తోంది. సిట్ అధికారులు స్వయంగా వెళ్లి జితేందర్, అనిల్ నుంచి లిఖిత పూర్వకంగా వివరాలు తీసుకున్నట్లు సమాచారం. ప్రభాకర్‌రావు టీం మావోయిస్టు సానుభూతిపరులు అంటూ ఇచ్చిన ఫోన్ నెంబర్లు ట్యాపింగ్‌కు అనుమతి ఇవ్వడంపై స్టేట్‌మెంట్ రికార్డ్ చేశారు.

ఫోన్ ట్యాపింగ్‌కు ఐజీ లేదా ఆ పై స్థాయి ఆఫీసర్‌కే అధికారం ఉంది. పదవి విరమణ పొంది.. ఓఎస్డీగా ఉన్న ప్రభాకర్‌రావును ఫోన్ లీగల్ ఇంటర్ సెప్సన్‌కు డిసిగ్నటెడ్ అథారిటీగా నియమించడంపై సిట్‌ ఆరా తీస్తోంది. డిసిగ్నేటెడ్ అథారిటీకి 7 రోజులు మాత్రమే అనుమానిత ఫోన్ నెంబర్లపై నిఘా పెట్టే అవకాశం.. గడువు ముగిసిన తర్వాత నిఘా పెట్టాలంటే రివ్యూ కమిటీ అనుమతి తప్పనిసరి.. కానీ ప్రభాకర్‌రావు ఇష్టం వచ్చినట్లు ట్యాపింగ్‌కు పాల్పడినట్లు సిట్‌ గుర్తించింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో  ప్రభాకర్‌రావు, ప్రణీత్‌రావు స్టేట్‌మెంట్‌లు కీలకంగా మారాయి. డీజీపీ జితేందర్, మాజీ ఇంటలిజెన్స్ చీఫ్ అనిల్ ఇచ్చిన వివరాల ఆధారంగా ఇవాళ ప్రభాకర్ రావు సిట్‌ అధికారులు విచారిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement