ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు.. హైదరాబాద్‌కు ప్రభాకర్‌రావు! | SIB Prabhakar Rao Arrived In Hyderabad Over Telangana Phone Tapping Case Investigation | Sakshi
Sakshi News home page

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు.. హైదరాబాద్‌కు ప్రభాకర్‌రావు!

Jun 8 2025 8:55 PM | Updated on Jun 9 2025 1:10 PM

phone tapping case In Telangana: SIB Prabhakar Rao In Hyderabad

హైదరాబాద్‌:  తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో కీలక సూత్రధారిగా ఉన్న ప్రభాకర్‌రావు హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఈరోజు(ఆదివారం, జూన్‌8వ తేదీ) అమెరికా నుంచి హైదరాబాద్‌కు వచ్చారు ప్రభాకర్‌రావు.  గత ప్రభుత్వంలో ఎస్‌ఐబీ(special intelligence bureau) చీఫ్‌గా ఉండి ట్యాపింగ్‌కు పాల్పడినట్లు ఆయనపై ఆరోపణలు వచ్చాయి.  

ఈ క్రమంలోనే సుప్రీంకోర్టు ఆదేశాలతో ప్రభాకర్‌రావు సిట్‌ విచారణకు హాజరు కావడానికి నగరానికి వచ్చారు. రేపు(సోమవారం, జూన్‌9 వతేదీ ) సిట్‌ ముందు విచారణకు హాజరుకానున్నారు ప్రభాకర్‌రావు. 

ప్రభాకర్‌రావును విచారిస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. గత ప్రభుత్వంలో ఎవరు చెబితే ఫోన్‌ ట్యాపింగ్‌కు పాల్పడ్డారన్న దానిపై విచారణ జరుగనుంది. ఇక ఎంతమంది ఫోన్లు ట్యాపింగ్‌ చేశారన్న కోణంలో కూడా సిట్‌ అధికారులు దర్యాప్తు చేయనన్నారు. ప్రధానంగా రాజకీయ, సినీ ప్రముఖలు, జడ్జిలు, జర్నలిస్టుల ఫోన్లు ట్యాప్‌ చేసినట్లు ఆరోపణలున్నాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement