ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో కీలక పరిణామం | Phone Tapping Case, SIT Records Minister Tummala Nageswara Rao Statement, More Details Inside | Sakshi
Sakshi News home page

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో కీలక పరిణామం

Jun 13 2026 2:43 PM | Updated on Jun 13 2026 4:17 PM

Phone Tapping Case: Sit Records Tummala Nageswara Rao Statement

సాక్షి, హైదరాబాద్‌: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్టేట్‌మెంట్‌ను సిట్‌ అధికారులు రికార్డు చేశారు. 2023 ఎన్నికల సమయంలో మంత్రి తుమ్మల ఫోన్‌ ట్యాప్‌ అయినట్లు అధికారులు గుర్తించారు. మాజీ సీఎం కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావుల్ని కూడా సిట్‌ ప్రశ్నించిన సంగతి తెలిసిందే. 2024 మార్చి 10న పంజాగుట్ట పోలీసుస్టేషన్‌లో నమోదైన ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు తర్వాత సిట్‌కు బదిలీ అయింది.

తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం కలిగించింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో అధికార మార్పు జరిగిన తర్వాత.. అప్పటి స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (SIB)లో పనిచేసిన కొందరు అధికారులు కీలక డేటాను తొలగించారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసును ప్రత్యేక విచారణ బృందం దర్యాప్తు సాగిస్తోంది. ఈ క్రమంలో మంత్రి తుమ్మల నాగేశ్వర రావు నివాసానికి వెళ్లిన అధికారులు.. ఆయన స్టేట్‌మెంట్‌ను రికార్డు చేశారు.

 

 

 

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement