
హైదరాబాద్,సాక్షి : తెలంగాణ హైకోర్టులో ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ జరిగింది. విచారణలో భాగంగా తనకు ముందుస్తు బెయిల్ ఇవ్వాలని మాజీ పోలీస్ ఆఫీసర్ ప్రభాకర్‌రావు కోరారు.ముందస్తు బెయిల్ ఇస్తే వారంలోపు విచారణకొస్తామని చెప్పారు. ప్రభాకర్ రావు తరుఫున ఆయన లాయర్ నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపించారు. అయితే, ప్రభాకర్‌రావు పాస్‌పోర్ట్ రద్దైతే ఇండియాకు ఎలా తిరిగొస్తారని ప్రభుత్వ లాయర్ సిథార్థ లూథ్రా ప్రశ్నించారు. ఇరు పక్షాల వాదనలు విన్నకోర్టు ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ ఈనెల 25కు వాయిదా వేసింది