సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎమ్మెల్సీ నవీన్‌రావుకు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (SIT) నోటీసులు ఇచ్చింది. ఇవాళ(ఆదివారం జనవరి 4) జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో విచారణకు రావాలని నోటీసులు ఇవ్వగా.. ఆయన విచారణకు హాజరయ్యారు. డివైజ్‌తో ట్యాపింగ్ చేసినట్లు నవీన్‌రావుపై ఆరోపణలు ఉన్నాయి. త్వరలో బీఆర్‌ఎస్ కీలక నేతలను సిట్ విచారించే అవకాశముంది.
కాగా, ఈ కేసులో ఒక పెన్ డ్రైవ్ కీలక ఆధారంగా మారగా.. ఈ పెన్ డ్రైవ్‌లో వందల సంఖ్యలో ఫోన్ నెంబర్లను సిట్ అధికారులు గుర్తించినట్టు సమాచారం మాజీ ఎస్‌ఐబీ చీఫ్ ప్రభాకర్ రావు విధుల్లో ఉన్న సమయంలోనే ఈ పెన్ డ్రైవ్‌లో ఫోన్ టాపింగ్‌కు సంబంధించిన.. కీలక సమాచారం స్టోర్ చేసినట్లు అధికారులు గుర్తించారు.
ఈ పెన్ డ్రైవ్‌లో వందల సంఖ్యలో ఫోన్ నంబర్లు నమోదై ఉన్నట్లు తేలింది. వీటిలో రాజకీయ నేతలు, ప్రముఖ జర్నలిస్టులు, హైకోర్టుకు చెందిన ఓ న్యాయమూర్తి ప్రొఫైల్ వివరాలు కూడా ఉన్నట్టు ప్రాథమికంగా గుర్తించారు. దీంతో, మరిన్ని వివరాలు సేకరించే పనిలో అధికారులు ఉన్నట్టు తెలిసింది.


