‘జడ్జీల ఫోన్లను ట్యాపింగ్‌ చేయమని మీకు ఎవరు చెప్పారు’? | SIT Investigation On SIB Ex Chief Prabhakar Rao Over Phone Tapping Case | Sakshi
Sakshi News home page

‘జడ్జీల ఫోన్లను ట్యాపింగ్‌ చేయమని మీకు ఎవరు చెప్పారు’?.. ప్రభాకర్‌ రావుకు సిట్‌ ప్రశ్నలు

Jun 11 2025 2:59 PM | Updated on Jun 11 2025 4:28 PM

SIT Investigation On SIB Ex Chief Prabhakar Rao Over Phone Tapping Case

సాక్షి,హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించిన ఫోన్‌ ట్యాపింగ్‌పై ఎస్‌ఐబీ మాజీ చీఫ్‌ ప్రభాకర్‌ రావు (Special Intelligence Branch (SIB) రెండో సారి సిట్‌ విచారణ కొనసాగుతోంది.  జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో మూడు గంటలుగా  కొనసాగుతున్న విచారణలో సిట్‌ బృందం  ప్రభాకర్‌ రావుపై (T Prabhakar Rao) పలు ప్రశ్నలు సంధించింది. 

డీసీపీ విజయ్ కుమార్, ఎసీపీ వెంకటగిరి ఇద్దరు కలిసి ప్రభాకర్ రావుని విచారిస్తున్నారు. విచారణలో హార్డ్ డిస్క్‌లు ఎందుకు ధ్వంసం చెయ్యాలని ఆదేశించారు?. ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో ప్రైవేటు వ్యక్తి శ్రవణ్ రావు పాత్ర ఎంత మేర ఉంది..? ప్రతిపక్ష నేతలు, జడ్జీలు, జర్నలిస్టుల ఫోన్ ట్యాప్ ఎవరు చెయ్యమన్నారని ప్రశ్నించింది.  

విచారణలో ఫోన్ ట్యాపింగ్‌ సంబంధించి టెలికాం సర్వీస్ డేటాను సైతం సిట్‌ ముందుంచింది. దీంతో పాటు ఎఫ్‌ఎస్‌ఎల్‌ రిపోర్టు, ఐదుగురు నిందితుల స్టేట్మెంట్ ఆధారంగా ప్రశ్నలు సంధించింది. ఇక సిట్‌ విచారణ మొదటి రోజు నోరు మెదపని ప్రభాకర్‌.. తనపై ఉన్నతాధికారుల సర్వెలైన్ ఉందని చెప్పినట్లు సమాచారం.

Phone Tapping: SIB మాజీ చీఫ్ ప్రభాకర్ రావును విచారిస్తున్నసిట్

Advertisement
 
Advertisement
Advertisement