
హైదరాబాద్, సాక్షి: ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్‌ఎస్ నేత ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలన ఆరోపణలకు దిగారు. బీఆర్‌ఎస్ హయాంలో ఎక్కడా ఫోన్ ట్యాపింగ్ జరగలేదని.. ఇప్పుడు కాంగ్రెస్ హయాంలోనే అది విచ్చలవిడిగా జరుగుతోందని అన్నారాయన.
సోమవారం ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు ప్రవీణ్‌కుమార్ హాజరయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో భాగంగా ఈరోజు సాక్షిగా వచ్చాను. కాంగ్రెస్ ప్రభుత్వం విచ్చలవిడిగా ఫోన్ టాపింగ్ చేస్తుందని ఫిర్యాదు చేశాను. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై సిట్ అధికారులకు ఫిర్యాదు చేశాను. డార్క్ వెబ్సైట్ ద్వారా మంత్రుల ఫోన్లో సైతం ముఖ్యమంత్రి టాపింగ్ చేయిస్తున్నారు.
గతంలో నా ఫోన్ హ్యాక్ అయినట్టు యాపిల్ సంస్థ నుంచి మెసేజ్ వచ్చింది. అదే విషయంలో కమిషనర్ కు ఫిర్యాదు చేశాను. బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ ఫోన్ టాపింగ్ పాల్పడలేదు. కాంగ్రెస్ ప్రభుత్వమే విచ్చలవిడిగా ఫోన్ టాపింగ్ పాల్పడుతోంది అని ఆరోపించారాయన.