ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసుకు సంబంధించి కొత్త సిట్ (Special Investigation Team) ఏర్పాటైంది. ఈ సిట్‌కు హైదరాబాద్ కొత్వాల్ (పోలీస్ కమిషనర్) సీపీ సజ్జనార్ నేతృత్వం వహించనున్నారు.
కొత్త సిట్‌లో ఐదుగురు ఐపీఎస్‌లు సహా మొత్తం 9 మంది అధికారులు ఉన్నారు. ఈ కేసుకు సంబంధించి రేపు సుప్రీం కోర్టులో విచారణ ఉన్న నేపథ్యంలో డీజీపీ ఉత్తర్వులు జారీ చేశారు.
సజ్జన్నార్ నేతృత్వంలోని కొత్త సిట్ సభ్యులు..
రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా
సిద్దిపేట సీపీ ఎస్.ఎం.విజయ్ కుమార్
మాదాపూర్ డీసీపీ రితిరాజ్
మహేశ్వరం డీసీపీ కె.నారాయణ రెడ్డి
గ్రేహౌండ్స్ గ్రూప్ కమాండర్ ఎం.రవీందర్ రెడ్డి
రాజేంద్రనగర్ అదనపు డీసీపీ కె.ఎస్.రావు
జూబ్లీహిల్స్ ఏసీపీ పి.వెంకటగిరి (దర్యాప్తు అధికారి)
టీజీనాబ్ డీఎస్పీ సీహెచ్.శ్రీధర్
హెచ్‌ఎంఆర్‌ఎల్ డీఎస్పీ నాగేందర్ రావు
కాగా, ఫోన్ ట్యాపింగ్‌పై ఐటీఏక్ట్, పీడీపీపీ యాక్ట్, ఐపీసీ సెక్షన్ల కింద పంజాగుట్ట పీఎస్‌లో కేసు (క్రైం నంబర్ 243/2024) నమోదైంది. ఈ కేసుపై కొత్తగా ఏర్పాటైన సిట్ విచారణ చేయనుంది. ఈ కేసుకు సంబంధించి త్వరితగతిన దర్యాప్తు పూర్తి చేసి ఛార్జిషీట్ దాఖలు చేయాలని డీజీపీ ఆదేశాలు జారీ చేశారు. అత్యున్నత వృత్తి నైపుణ్యాలతో విచారణ జరపాలని సూచించారు.


