ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు: సిట్‌ ముందుకు టీపీసీసీ చీఫ్‌ మహేష్‌ గౌడ్‌ | Phone Tapping Case: TPCC Chief Mahesh Kumar Goud To Attend SIT Office | Sakshi
Sakshi News home page

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు: సిట్‌ ముందుకు టీపీసీసీ చీఫ్‌ మహేష్‌ గౌడ్‌

Jun 17 2025 12:25 PM | Updated on Jun 17 2025 1:33 PM

TPCC Chief Mahesh Goud

టీపీసీసీ చీఫ్‌ మహేష్‌ గౌడ్‌

సాక్షి, హైదరాబాద్‌: కీలకమైన ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బి. మహేశ్‌కుమార్‌గౌడ్‌ సాక్షిగా సిట్‌ ముందు హాజరయ్యారు. ఇవాళ ఆయన జూబ్లీహిల్స్‌ ఏసీపీ వద్ద సాక్షిగా తన వాంగ్మూలం ఇచ్చేందుకు వెళ్లారు. 2023లో టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా ఉన్న మహేశ్‌గౌడ్‌ ఫోన్‌ను అప్పటి ప్రభుత్వం ట్యాప్‌ చేసిందని ఆయన పలుమార్లు ఇప్పటికే ఆరోపించారు.

తాను కూడా ఫోన్‌ట్యాపింగ్‌ బాధితుడినేనని చెప్పారు. ఈ నేపథ్యంలో ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో సాక్షిగా పీసీసీ చీఫ్‌ ఏం చెప్తారనేది ఆసక్తిగా మారింది. ఈ క్రమంలో మహేష్‌కుమార్‌ గౌడ్‌ సిట్‌ కార్యాలయానికి చేరుకోగా.. జూబ్లీహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌ ముందు కాంగ్రెస్‌ కార్యకర్తలు హడావుడి చేశారు. జూబ్లీహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌లోకి వెళ్లేందుకు కాంగ్రెస్‌ కార్యకర్తలు ప్రయత్నించారు. దీంతో వారిని అడ్డుకున్న పోలీసులు.. బయటకు పంపించారు.

2018లో ఫోన్‌ ట్యాపింగ్‌ వల్లే కాంగ్రెస్‌ ఓడిపోయింది: మహేష్‌ గౌడ్‌
సిట్‌ ముందు హాజరైన అనంతరం మహేష్‌ గౌడ్‌ మీడియాతో మాట్లాడుతూ.. ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో వాస్తవాలు బయటకువచ్చాయన్నారు. 2018లో ఫోన్‌ ట్యాపింగ్‌ వల్లే కాంగ్రెస్‌ ఓడిపోయింది. 650 మంది కాంగ్రెస్‌ నేతల ఫోన్లు ట్యాప్‌ చేశారు. గత ప్రభుత్వంలో అధికారులు నేతల కనుసన్నల్లోనే పనిచేశారు. ఫోన్‌ ట్యాప్‌తో రాజకీయ లబ్ధి పొందారు’’ అని మహష్‌ గౌడ్‌ ఆరోపించారు.
 

 

Advertisement
 
Advertisement
Advertisement